పాలకొండ జనసేన అభ్యర్థి ఖరారు.. ఇదంతా బాబు ప్లానేనా!

పాలకొండ జనసేన అభ్యర్థిగా జయకృష్ణ. ఆ సీటును జనసేనకు ఇవ్వడం వెనక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉందా? ఓడిపోతామని తెలిసే ఆ సీటును జనసేనకు కట్టబెట్టారా?

Update: 2024-04-10 06:50 GMT

పాలకొండ నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసేది ఎవరు? ఈ సీటుపై కూటమిలో కుమ్ములాటలు జరుగుతున్నాయా? అందుకే అభ్యర్థి ఎంపికలో ఆలస్యమా? కొన్ని రోజులుగా నియోజకవర్గం ప్రజలతో పాటు ఆంధ్రుల మనసుల్లో మెదిలిన ప్రశ్నలివి. తాజాగా వాటన్నింటికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెరదించారు. పాలకొండ నుంచి తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థి ఎంపిక పూర్తయినట్లు ప్రకటించారు. పాలకొండలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పార్టీ కార్యదర్శి హరి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే అభ్యర్థి ఎంపిక ఆలస్యం అయిందని, విడతల వారిగా అభ్యర్థులతో చర్చలు చేసిన అనంతరం చివరకు జయకృష్ణను పార్టీ అధిష్టానం నిర్ణయించిందని ఆయన వివరించారు. తాము చేసిన సర్వేలో జయరామకృష్ణకు మద్దతు అత్యధికంగా రావడంతోనే ఆయన పేరును జనసేనాని కన్ఫర్మ్ చేశారు. ఈ విషయాన్ని జనసేన తమ ప్రకటనలో కూడా పేర్కొంది.

పాలకొండ జనసేనకి ఎందుకు

పొత్తులో భాగంగా టీడీపీ స్వచ్ఛంగా పాలకొండ సీటును జనసేనకు కట్టబెట్టడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీని వెనక భారీ ప్లాన్ ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పాలకొండలో టీడీపీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, టీడపీకి పాలకొండలో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఆ సీటును జనసేనకు అంటగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీటు విషయంలో టీడీపీ పెద్దలు చాలా తెలివిగా వ్యవహరించారని, ఈ ప్లాన్ వెనక మాస్టర్‌మైండ్ చంద్రబాబే అని కూడా ప్రచారం జరుగుతోంది. విశ్లేషకులు కూడా అందులో వాస్తవాలు లేకపోలేదని, అప్పటి వరకు పాలకొండలో పోటీకి సన్నద్దం అయిన టీడీపీ అంతర్గత సర్వే ఫలితాలను చూసిన వెంటనే మనసు మార్చుకుందని, ఆ తర్వాత పాలకొండ సీటును జనసేనకు ఇవ్వాలని నిర్ణయించుకుందని విశ్లేషకులు అంటున్నారు. ఓడిపోతామని తెలియడంతో ఓడిపోయే సీటును జనసేనకు కట్టబెట్టారని విశ్లేషకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ప్లాన్ అదేనా..!

ఓడిపోయే సీటును జనసేనకు అంటగట్టిన టీడీపీ.. అక్కడి అభ్యర్థి విషయంలో కూడా రాజకీయ చతురతను చూపిందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్న నిమ్మక జయరామకృష్ణ కొన్ని రోజుల కృతం జనసేన కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీలో చేరే సమయంలోనే తాను ఎన్నికల బరిలో నిలబడనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయననే పాలకొండ అభ్యర్థిగా జనసేన ప్రకటించింది. అయితే ఇదంతా కూడా టీడీపీ అధినేత, రాజకీయ చాణక్యుడు చంద్రబాబు ప్లానే అన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయే సీటే అయినా వదులుకోవడానికి ఇష్టపడని బాబు.. అక్కడి నుంచి తమ పార్టీ గుర్తునే తప్పించారు తప్పితే అభ్యర్థిని మాత్రం తమ వారినే నిలబెట్టారని, జనసేన జెండా కింద టీడీపీ అభ్యర్థిగానే జయకృష్ణ పోటీ చేయస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జయకృష్ణ గెలుస్తారా!

పాలకొండలో టీడీపీపై వ్యతిరేకత ఉండటంతోనే ఆ సీటును టీడీపీ.. జనసేనకు ఇచ్చిందని వాదనలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా మరో ప్రశ్న తలెత్తింది. పాలకొండలో జయకృష్ణ గెలుస్తారని సర్వేలు ఎలా చెప్పాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా.. టీడీపీ సర్వే చెప్పినట్లు పాలకొండలో టీడీపీకి వ్యతిరేకత ఉంటే ఇన్నాళ్లూ ఆ పార్టీలోనే ఉన్న వ్యక్తి జయకృష్ణ. ఇప్పుడు ఆయన పార్టీ మారి పోటీ పడితే ప్రజలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని విశ్లేషకులు కూడా ఎత్తి చూపుతున్నారు. ఏదో పోటీకి అభ్యర్థిని నిలబెట్టాం అన్న పరిస్థితే పాలకొండలో ఏర్పడేలా ఉందని, ప్రస్తుతం అక్కడి రాజకీయ సమీకరణాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. మరి టీడీపీ నుంచి జనసేనకు మారి పాలకొండ బరిలో నిలబడుతున్న జయకృష్ణను విజయం వరిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News