‘సిద్ధం’ ట్వీట్‌పై అంబటి రాయుడు క్లారిటీ!
‘సిద్ధం’ అంటూ చేసిన ట్వీట్‌పై అంబటి రాయుడు స్పష్టత నిచ్చారు. తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.
By : S Subrahmanyam
Update: 2024-04-11 07:20 GMT
‘సిద్ధం’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆయన ఏ సైడ్ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెళ్లువెత్తాయి. అంబటి రాయుడు డబుల్ గేమ్ అడుతున్నాడని, ఆయనను వెంటనే పాలిటిక్స్ నుంచి ఎలిమినేట్ చేయాలంటూ నెటిషన్లు మండిపడుతున్నారు. జనసేనలో చేరి ఇప్పటికీ వైసీపీ నినాదాలు చేస్తున్నారంటూ మరికొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన ట్వీట్‌పై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. ‘‘పవన్ కల్యాణ్‌ను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్దాం’’అని మరో ట్వీట్ చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నెటిజన్లు కాస్త చల్లబడ్డారు. ఈ ముక్క ముందు చెప్పాలంటూ ఇంకొందరు బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇలాంటి మాటలు మార్చే వ్యక్తులతో పవన్ జాగ్రత్తగా ఉండాలని జనసైనికులు హితవు పలుకుతున్నారు.
అంబటి రాయుడు రాజకీయ జీవితం
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీసీ కండువా కప్పుకుని తన రాజకీయ అరంగేట్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయన ఆఖరికి వలస రాజకీయాలకు కూడా అలవరుచకున్నారు. పట్టున పది రోజులు కూడా పూర్తికాకుండా వైసీపీకి రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీ గూటికి చేరారు. అప్పటి నుంచి ఆయన ఆంధ్ర రాజకీయాల్లో తన ప్రయాణం జనసేతోనే అంటున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో అంబటి రాయుడికి కూడా సీటు దక్కొచ్చని అనేక మంది భావించారు. కానీ పవన్.. అంబటికి ఎక్కడి నుంచి అవకాశం కల్పించలేదు.