మారిన అకీర, ఆద్య ఇంటి పేరు..

అకీరా, ఆద్య ఇంటి పేర్లను మారాయి. అందుకు పవన్ అఫిడవిట్ సాక్ష్యం. మరి వాళ్ల పేరిట ఉన్న ఆస్తులు ఎంతో తెలుసా..

Update: 2024-04-23 11:36 GMT

జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌లో తానకు సంబంధించిన అన్ని వివరాలను పవన్ వెల్లడించారు. ఈ క్రమంలో ఓ సంచలన విషయం వెలుగు చూసింది. ఇన్నాళ్లూ కొణిదెల వారసులుగా అంతా భావిస్తున్న అకీరా, ఆధ్య ఇంటి పేర్లు మారాయి. వారికి ‘దేశాయి’ని ఇంటిపేరుగా ఉంది. ఇందుకు ఈరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పవన్ కల్యాణ్ అందించిన అఫిడవిట్ నిదర్శనం. ఇందులో వారి పేర్లు అకీరనందర్ దేశాయ్, ఆద్య దేశాయ్‌గా ఉన్నాయి. అంతేకాకుండా వారి పేరిట పవన్‌కు సంబంధించిన ఎటువంటి ఆస్తులు లేవు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దాంతో పాటుగా ఈ ఐదేళ్లలో తన సంపాదన, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలను కూడా పవన్ కల్యాణ్ పొందుపరిచారు. దాని ప్రకారం ఈ ఐదేళ్లలో పవన్ కల్యాణ్ రూ.114 కోట్లు సంపాదించారు.

పవన్ ఐదేళ్ల సంపాదన ఎంతంటే!

జనసేనాని పవన్ కల్యాణ్ తన అఫిడవిట్‌లో తన ఐదేళ్ల సంపాదనను వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం ఐదేళ్లలో పవన్ కల్యాణ్ రూ.114 కోట్ల 76 లక్షల 78 వేల 300 సంపాదించారు. ఈ మొత్తానికి పన్నుగా రూ.47 కోట్ల 7 లక్షల 32 వేల 875 చెల్లించగా, జీఎస్‌టీ కింద రూ.26 కోట్ల 84 లక్షల 70 వేలు చెల్లించారు.

పవన్ అప్పులు ఇలా

ఆస్తులతో పాటే ఐదేళ్లలో పవన్ కల్యాణ్ అప్పులు కూడా బాగానే పెరిగాయి. పవన్ కల్యాణ్ అప్పులు రూ.64 కోట్ల 26 లక్షల 84 వేల 453 గా ఉన్నాయని తన అఫిడవిట్‌లో పేరుకొన్నారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలే రూ.17 కోట్ల 56 లక్షల 84 వేల 453 అని, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

పార్టీ ఇచ్చిన విరాళాలు

తన ఆస్తులు అప్పులతో పాటు వివిధ సంస్థలు, జనసేన నిర్వహించిన పలు కార్యక్రమాలకు విరాళాల రూపంలో పార్టీ అందించిన మొత్తానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడించాయి. విరాళాల మార్గాన రూ.17 కోట్ల 15 లక్షలు అని వివరించారు. అందులో పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు వేరువేరుగా విరాళాలు అందజేసినట్లు ఆయన వివరించారు. వివిధ సంస్థలకు రూ.3 కోట్ల 32 లక్షల 11 వేల 717 అందించారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.1 కోటి, ఏపీ సీఎం సహాయక నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.30 లక్షల 11 వేల 717, పవన్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కోసం రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు ఆయన తన అఫిడవిట్‌లో పొందుపరిచారు.

ఇదిలా ఉంటే తన అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్.. తన పిల్లలు అకీరా, ఆద్య పేరిట రూపాయి ఆస్తులు కూడా లేనట్లు చూపారు. అంతేకాకుండా వారికి పేర్లను కూడా అకీరా దేశాయ్, ఆద్య దేశాయ్‌గా చూపారు.

Tags:    

Similar News