విజయమ్మ, షర్మిలపై జగన్ కేసు డిసెంబర్ కు వాయిదా

విజయమ్మ లాయర్ విన్నపం మేరకు కేసును డిసెంబర్ 13వ తేదీకి ట్రైబ్యునల్ వాయిదా వేసింది

Update: 2024-11-08 09:36 GMT

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు డిసెంబర్ 13కి వాయిదాపడింది. సరస్వతి పవర్ కంపెనీ(Saraswati Powers)లో షేర్లను తనకు తెలియకుండానే తన తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma), చెల్లెలు వైఎస్ షర్మిల(YS Sharmila)కు బదిలీ చేయటాన్ని ఆక్షేపిస్తు జగన్ ట్రైబ్యునల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. షేర్ల బదిలీ ప్రక్రియను నిలిపేయాలని కోరుతు జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)(NCLT)కి చేసిన ఫిర్యాదు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. జగన్(YS Jagan Mohan Reddy) ఫిర్యాదు ప్రకారం ఎన్సీఎల్టీ కేసు నమోదుచేసుకుని విచారణ మొదలుపెట్టింది. విచారణలో భాగంగానే ఎన్సీఎల్టీ విజయమ్మ, వైఎస్ షర్మిలకు నోటీసులు జారీచేసింది.

శుక్రవారం జరిగిన విచారణలో విజయమ్మ, షర్మిల తరపు లాయర్లు ఎన్సీఎల్టీకి హాజరై కొంత సమయం కావాలని అడిగారు. విజయమ్మ లాయర్ విన్నపం మేరకు కేసును డిసెంబర్ 13వ తేదీకి ట్రైబ్యునల్ వాయిదా వేసింది. తనకు తెలీకుండానే అక్రమంగా తల్లి, చెల్లి షేర్ల బదిలీ ప్రక్రియలో పాలుపంచుకున్నట్లు జగన్ ఆరోపించటం అప్పట్లో సంచలనమైంది. తన ఆరోపణల్లో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రతివాదులుగా చేర్చారు. షేర్ల బదిలీ ఫారాలు, అవసరమైన డాక్యుమెంట్లు ఏవికూడా సరిగా లేకుండానే, తన అనుమతి తీసుకోకుండానే చెల్లెలు పేరుపైకి తల్లి షేర్లను బదిలీచేయటం అక్రమమన్నది జగన్ వాదన. అక్రమాస్తుల విచారణలో సరస్వతి పవర్ షేర్లు కూడా ఈడీ(ED) అటాచ్ మెంట్లో ఉందని చెప్పారు. కేసు తేలకుండానే షేర్లు తల్లి పేరునుండి చెల్లెలు పేరుమీదకు బదలి అయితే తాను ఇబ్బందులో పడతానని జగన్ వాదన. అయితే ఈడీ అటాచ్ మెంట్లో సరస్వతి పవర్ షేర్లు లేవని షర్మిల అంటున్నారు.

తన బెయిల్ రద్దుచేయించాలన్నదే చెల్లెలు కుట్రగా జగన్ ఆరోపించారు. చంద్రబాబునాయుడు(Chandrababu naidu) చెప్పినట్లుగా తన చెల్లెలు ఆడుతోందని, కుట్రలో భాగస్వామి అయ్యిందని జగన్ మండిపోతున్నారు. తల్లికి తాను రాసిచ్చిన షేర్లు చెల్లెలు పేరుమీదకు బదిలీ అవ్వాలంటే ముందు కోర్టులో కేసు తేలాల్సుంటుందని జగన్ అన్నారు. అప్పటివరకు షేర్ల బదిలీ ప్రక్రియను నిలిపేయాల్సిందిగా జగన్ ఎన్సీఎల్టీని కోరారు. ఆ కేసుపైనే ఈరోజు విచారణ జరిగి డిసెంబర్ 13కి వాయిదా పడింది.

Tags:    

Similar News