రెండు ఎన్నికల్లో జగనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
జగన్ చుట్టూనే ఎన్నికలు జరిగాయి. జగన్ వద్దా.. కావాలా అనే దానిపైనే ఎలక్షన్లు జరిగాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రేయారిటీలోనే లేరని, జగన్ వద్దనుకొని ఓట్లేసారు. సర్వత్ర కొనసాగుతోన్న చర్చ.
Byline : Vijayakumar Garika
Update: 2024-07-28 07:51 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు 2019లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని, ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు అని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోన్న చర్చ. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంగానే ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో రావాలి జగన్.. కావాలి జగన్ అనే నినాదంతో జగన్‌మోహన్‌రెడ్డిని కావాలనుకొని ఓట్లేసి గెలిపించారని, 2024 ఎన్నికల్లో పోవాలి జగన్ అనే నినాదంతోనే ఓడించారనే చర్చ రాజకీయ వర్గాలు, అధికార వర్గాల్లోను జరుగుతోంది.
తొలి సారి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019 ఎన్నికల సమయానికి పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంది. అనుభవం ఉన్న నేత కావాలని, చంద్రాబాబు అయితే సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అందుకే చంద్రబాబు వైపు ప్రజలు మొగ్గు చూపారని, తీరా అదంతా కేవలం మాటలు మాత్రమే అని, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి తాత్కాలిక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్నారనే టాక్ కూడా ఉంది. అంతేకాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోరనే విమర్శలు చంద్రబాబుపై ఉన్నాయి. 2014ఎన్నికల ముందు రైతు రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీ, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై నిలబడకుండా ఇచ్చిన మాటను వక్రీకరించిన తీరు ప్రజల్లో వ్యతిరేతను పెంచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబును కాదని జగన్‌కు అవకాశం కల్పించారు.
తర్వాత 2019 ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో మారిపోయింది. జగన్ కేంద్రంగానే సాగాయి. దీంతో జగన్‌కు 151 స్థానాలు కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కోవిడ్ వంటి విపత్తు తరుణంలో కూడా ఆయన పాలనపై వ్యతిరేకత రాలేదు. మూడో ఏట కాస్త వ్యతిరేకత వచ్చినా.. డీబీటీ ద్వారా వాటిని భర్తీ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన తెరపైకి వచ్చేంత వరకు ప్రతిపక్షాలకు కూడా ప్రజల్లో ఆదరణ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు అరెస్టు పర్వం తెరపైకి వచ్చిన తర్వాత సినారియో మారిపోయింది. జగన్‌పై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఎన్నికల సమయానికి అది పెరుగుతూ వచ్చింది. అంతేకాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిపై ప్రేమగా మారలేదని, జగన్ వద్దా.. కావాలా అనేదానిపైనే ఓటింగ్ జరిగిందని.. 2024 ఎన్నికల్లో ఎక్కువు మంది ప్రజలు జగన్‌ను వద్దనుకునే ఆయనను ఓటించారని చర్చించుకుంటున్నారు. అయినా ప్రజల్లో జగన్‌కు మంచి ఆదరణ ఉందని, దాదాపు 40 శాతం మంది ఓటర్లు జగన్‌వైపే ఉన్నారని, ఇప్పటికీ అది చెక్కు చెదర లేదని, 2019, 2024 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంగానే ఎన్నికలు జరిగాయని, రెండు ఎన్నికల్లో ఆయనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే ఆసక్తి కరమైన టాక్ అన్ని వర్గాల్లో వినిపిస్తోంది.