అధర్మం బలంగా ఉన్నా తాత్కాలికమే..ధర్మం నెమ్మదిగా ఉన్నా శాశ్వతమే

సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్‌ ధర్మం, అధర్మం గురించి వెల్లడించారు.;

Update: 2025-08-16 06:34 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనదైన శైలిలో అధికార పక్షాన్ని, సీఎం చంద్రబాబును ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అధర్మ ప్రభుత్వం అన్నట్లుగా, వారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారన్నట్టుగా పరోక్షంగా విమర్శించారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే అంటూ చెబుతూ.. దీనికి శ్రీకృష్ణుని జీవితమే దీనికి నిదర్శనం అంటూ పేర్కొన్నారు.

ఓ వైపు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూనే పరోక్షంగా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా.. అది శాశ్వతం అని పేర్కొంటూ.. దీనికి శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అంటూ వెల్లడించారు. ఆ మేరకు శనివారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.
జగన్‌ ఏమన్నారంటే..
అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా.. అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News