పొంగులేటి చెప్పిన బాంబు ఇదేనా ?

మంత్రి హైదరాబాద్ తిరిగొచ్చిన రెండు రోజులకు జన్వాడ(Janwada farm Houae) ఫామ్ హౌసుపై పోలీసులు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-10-29 05:29 GMT

దక్షిణకొరియా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు తొందరలోనే బాంబులు పేలుతాయని చేసిన ప్రకటించిన విషయం తెలిసిందే. బాంబులు పేలుతాయని మంత్రి చెప్పింది టెలిఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఆరోపణలపై జరుగుతున్న విచారణలో కొందరు ప్రముఖులు తగులుకుంటారన్న అర్ధంలో చెప్పారు. దక్షిణకొరియా(South Korea) నుండి తాము హైదరాబాద్(Hyderabad) చేరుకునేలోగానే బాంబులు పేలినా ఆశ్చర్యపోవక్కర్లేదని కూడా అన్నారు. మంత్రి చెప్పినట్లే బాంబులు పేలాయా ? మంత్రి హైదరాబాద్ తిరిగొచ్చిన రెండు రోజులకు జన్వాడ(Janwada farm Houae) ఫామ్ హౌసుపై పోలీసులు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ @ రాజ్ పాకాలకు(Raj Pakala) చెందిన ఫామ్ హౌసులో అనుమతులు లేని మద్యంతో పాటు డ్రగ్స్(Drugs) పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై పోలీసులు దాడులు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దాడుల నుండి రాజ్ పాకాల తప్పించుకున్నా ఆయన సన్నిహితుడు మద్దూరి విజయ్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయించారు. అందులో మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ రిజల్టు వచ్చిందని పోలీసులు చెప్పారు. తమపై పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఆదేశాలివ్వాలన్న పాకాల పిటీషన్ను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారించారు. 48 గంటల్లో పోలీసుల విచారణకు హాజరవ్వాలని జస్టిస్ పాకాలను ఆదేశించారు. ఇదే విషయమై నిందితుడు సహకరించినపుడు ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవద్దని పోలీసులను కూడా జస్టిస్ ఆదేశించారు. హైకోర్టు ఆదేశించినా రాజ్ పాకాల ఇంతవరకు పోలీసుల ముందు లొంగలేదు.

తమ ఫామ్ హౌసులో జరిగిన పార్టీలో ఎలాంటి డ్రగ్స్(Drugs) వాడలేదని రాజ్ పాకాల తరపు లయర్ మయూర్ రెడ్డి అంటుంటే దొరికిన వాళ్ళకు టెస్టులు చేయిస్తే ఇద్దరు ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన లాయర్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇంకా కొందరికి పోలీసులు టెస్టులు చేయిస్తున్నారని రిజల్టు రావాలని చెప్పారు. పాకాల లొంగిపోతే చాలా విషయాలు బయటకు వస్తాయని లాయర్ చెప్పారు. ఇదే సమయంలో పార్టీలో పాల్గొన్న వారిలో ఇంకా కొందరు పోలీసుల ముందుకు రాలేదు.

ఇక్కడే అసలు ట్విస్టు

ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్టు బయటపడుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ ట్విస్టు ఏమిటంటే పార్టీలో కొందరు మహిళలు కనబడుతున్నారు. వీరిలో ఒకరు కేటీఆర్ భార్య శైలిమా కల్వకుంట్ల (KTR wife Sailima Kalvakuntla) అని ప్రచారం జరుగుతోంది. పార్టీలో శైలిమ కూడా పాల్గొన్నారనేందుకు ఆధారంగా 13 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో ఇపుడు బాగా వైరల్ అవుతోంది. బ్లూ డ్రస్ వేసుకున్న ఒక మహిళ తన మోహం వీడియోలో కనబడకుండా మరో వ్యక్తి వెనుక దాక్కున్నట్లు కనబడుతోంది. అలాగే రెండో మహిళ హాలులో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నారు. సదరు మహిళా కాస్త దూరంలో ఉన్నారు కాబట్టి మొహం స్పష్టంగా కనబడటంలేదు. పార్టీలో పాల్గొన్నంత మాత్రాన అందరు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేందుకు లేదు. కాకపోతే పార్టీలో ఏమి జరిగింది అన్న విషయాలకు ప్రత్యక్షసాక్షి అవుతారనటంలో సందేహంలేదు. రక్తపరీక్షలు చేయిస్తే కాని ఎవరెవరు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారన్న విషయం నిర్ధారణకాదు. రక్తపరీక్షలు చేయించుకోవటంలోనే చాలామంది పోలీసులకు సహకరించటంలేదు. అందుకనే పార్టీలో పాల్గొన్న వారందరు డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 13 సెకన్ల వీడియోలో శైలిమ తన మొహం కనబడకుండా ఒక వ్యక్తి వెనుక దాక్కున్నట్లు కనబడుతోంది.

కేటీఆర్లో ఫ్రస్ట్రేషన్

జన్వాడ ఫామ్ హౌసు, పోలీసుల దాడులు, బావమరిది పార్టీ నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ (KTR) తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. బావమరిది పార్టీ నిర్వహణ, భార్య పార్టిసిపేషన్ గురించి అడిగిన ప్రశ్నకు తాను హాజరుకాలేదని మాత్రమే కేటీఆర్ చెప్పారు. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి కేటీఆర్ పెద్దగా ఇష్టపడలేదు. పార్టీ నిర్వహించి బావమరిది రాజ్ పాకాల, అందులో పాల్గొని భార్య శైలిమ వివాదాల్లో ఇరుక్కున్నారన్న అసహనం కేటీఆర్ లో బాగా కనబడుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ(Shabbir Ali) మాట్లాడుతు పాకాల తన ఫామ్ హౌసులో రెగ్యులర్ గా డ్రగ్స్ పార్టీలు ఇస్తుంటాడని ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారం గురించి అడిగినపుడు కేటీఆర్ లో ఎందుకు అసహనం కనబడుతోందని నిలదీశారు. డ్రగ్స్ గురించి ఎక్కడ బయటపడినా వెంటనే కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతివారం పాకాల తన ఫామ్ హౌసులో రేవ్ పార్టీ నిర్వహిస్తాడని అందులో డ్రగ్స్ కూడా తీసుకుంటారని షబ్బీర్ ఆరోపించారు. బావమరిదితో పాటు కేటీఆర్ కూడా నార్కొటిక్స్(Narcotics) పరీక్షలు చేయించుకుంటే వాస్తవాలు బయటపడతాయని సూచించారు. జరిగింది, జరుగుతున్నది చూసిన తర్వాత బాంబులు పేలుతాయని పొంగులేటి(Ponguleti) చెప్పింది ఇదేనా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News