సీఎం చంద్రబాబు అన్ని రోజులు ఉండవల్లి ఇంటికెళ్లంది అందుకేనా ?

సీఎం చంద్రబాబు దాదాపు 10రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి వరద సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉండవల్లి నివాసంలోకి వెళ్లారు. ఏంటి సీక్రెట్‌?

Update: 2024-09-12 08:55 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు. ఎందుకు అన్ని రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. అక్కడ నుంచే ఎందుకు వరద సహాయక చర్యలు చేపట్టారు అనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు ఇలా చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణా నదికి భారీ స్థాయిలో వచ్చిన వరద ప్రవాహానికి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇల్లు మునిగి పోయిందని, దీని వల్ల అక్కడ నుంచి ఆయన బయటకు రావడం తప్ప లేదని, ఇదే సమయంలో విజయవాడ నగరం ముంపునకు గురి కావడంతో విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉంటూ సహాయక చర్యలు చేపట్టారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లే వరదలో మునిగి పోతే ఇక ముంపునకు గురైన సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకుంటారనే టాక్‌ బయటకు వస్తే సీఎంపై ప్రజల్లో నమ్మకం పోతుందని, అందువల్ల నీట మునిగిన విషయాన్ని బయకు పొక్కనీకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే టాక్‌ ఉంది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జైభీమ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరేవిగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది.

ఆగస్టు 31వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఓర్వకల్లు విమానాశ్రయానకి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్ల పంపిణీ చేసి అనంతరం 3:30 గంటల వరకు ఓర్వకల్లు ప్రజలతో ముఖాముఖి నిర్వహించాలని, తర్వాత 3:40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లాలని షెడ్యూల్‌ ఖరారు చేశారు. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో దీనిని రద్దు చేశారు. ఓర్వకల్లు కంటే ముందు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో తొలుత సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు చేశారు. తర్వాత దీనిని రద్దు చేసి ఓర్వకల్లుకు మార్చారు. వర్షాల కారణంగా దానిని కూడా రద్దు చేశారు.
సెప్టెంబరు 1 ఆదివారం నాటికే ప్రకాశం బ్యారేజీకి వరద పోటు పెరిగింది. ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అది పెరుగుతూ పోయింది. దాదాపు 9.17లక్షల క్యూసెక్కులకుపైగా ఫ్లడ్‌ పెరిగింది. దీని వల్ల కరకట్టకు కృష్ణా నదికి మధ్యలో ఉన్న సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముంపు చుట్టుముట్టింది. ఇంటిలోకి నీరు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసేందుకు సిబ్బంది ఉపక్రమించారు. వేలాది ఇసుక బస్తాలతో అడ్డు కట్ట వేసి నీటిని ఇంట్లోకి రాకుండా శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. మరో వైపు పంపులతో ఇంట్లోకి వచ్చిన నీటిని తోడే ప్రయత్నాలు కూడా చేశారు. ఫ్లడ్‌ రాకుండా ఉండి ఉంటే మునక ప్రమాదం నుంచి బయట పడేవారు. కానీ ఎగువ భాగాన నుంచి వచ్చే వరద ప్రహవం పెరుగుతుండటంతో ఇంట్లోకి నీరు రాకుండా ఆపలేక పోయారు.
చరిత్రలో ఎన్నడు లేని విధంగా 11.50లక్షల క్యూసెక్కుల వరకు ఫ్లడ్‌ వాటర్‌ పెరిగింది. దీంతో సీఎం చంద్రబాబు నివాసం దాదాపు రెండు అంతస్తుల వరకు మునిగి పోయిందనే టాక్‌ వినిపించింది. సోమవారం నాటికి అంటే సెప్టెంబరు నాటికి వరద ప్రవాహం పెరగడంతో ఇక ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి.
Delete Edit
ఇదిలా ఉంటే ఇదే కరకట్టపైన సీఎం చంద్రబాబు ఇంటికి కూత వేటు దూరంలో ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమం ముంపునకు గురైంది. ఆ విషయాన్ని డాక్టర్‌ మంతెన సత్యనారాయణే స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా విడుదల చేశారు. నిజానికి సీఎం చంద్రబాబు నివాసంతో సహా కరకట్టకు, కృష్ణా నదికి మధ్యలో ఉన్న అన్నీ కట్టడాల కంటే మంతెన సత్యనారాయణ ఆశ్రమమే ఎత్తులో ఉంటుంది. తక్కిన అన్ని మునిగినా ఆశ్రమానికి పెద్దగా వరద ప్రభావం ఉండదు. ఆ విషయాన్ని మంతెన సత్యనారాయణే స్వయంగా వెల్లడించారు.
Delete Edit
దాదాపు 12 ఏళ్లుగా ఇదే భవనంలో ఉన్నా ఇలాంటి వరదలు రాలేదని, పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. అంత ఎత్తులో ఉన్న ఆశ్రమమే ముంపునకు గురైనప్పుడు దాని కంటే లో తట్టు ప్రాంతంలో ఉన్న సీఎం చంద్రబాబు నివాసం ఎలా ముంపునకు గురి కాకుండా ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఉండవల్లి నివాసం నుంచి బయటకు రావడం అనివార్యంగా మారిందిని, దీంతో తన మకాంను విజయవాడ కలెక్టరేట్‌కు వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కరకట్ట మీద ఉన్న సీఎం చంద్రబాబు నివాసం మునిగి పోతుందనే ఉద్దేశంతోనే బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడ మీదకు వరద నీటిని వదిలేశారని ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చిన జగన్‌ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తన ఇంటి ముంపు ఎక్కడ బయట పడుతుందనే ఉద్దేశంతోనే విజయవాడ కలెక్టరేట్‌ నుంచి సహాయక చర్యలు చేపడుతున్నారనే విమర్శలు కూడా జగన్‌ చేశారు.
తర్వాత అది రాజకీయ రంగు పులుముకుంది. వరద నీటికి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నీట మునిగిందని, దీనిని బయటకు పొక్కనీకుండా జాగ్రత్తలు తీసుకున్నారని జై భీమ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, హై కోర్టు అడ్వకేటు జడ శ్రావణ్‌కుమార్‌ ఒక యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాతూ వ్యాఖ్యలు చేశారు.
మూడు రోజుల తర్వాత ఉండవల్లి ఇంట్లో వరద నీరు తగ్గినా సీఎం చంద్రబాబు అక్కడకు వెళ్లేందుకు ఆసక్తిని కనబరచ లేదు. మురికి నీరు కావడంతో వాటిని తొలగించి, శానిటేషన్‌ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత ఇంట్లోకి వస్తే బాగుంటుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని వ్యక్తిగత వైద్యుల సూచనల మేరకు అడుగు పెట్ట లేదనే టాక్‌ కూడా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు వయసు పెద్దది కావడంతో ఇన్‌ఫెక్షన్‌లకు తావివ్వకుండా పెద్ద ఎత్తున శానిటేషన్‌ చర్యలు చేపట్టారని, అందువల్లే మంగళవారం తన నివాసంలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టారని చర్చ అధికార వర్గాల్లోను వినిపిస్తోంది. అంతేకాకుండా విజయవాడ ముంపు పూర్తి స్థాయిలో తగ్గి పోవడంతో కూడా ఆయన ఇంటికి వెళ్లేందుకు ఆసక్తిని కనబరచారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News