పవన్‌ కళ్యాణ్‌ ఏలూరు పర్యటన అందుకేనా?

ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు పరస్పర దాడులకు దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ చొరవ పని చేస్తుందా?

By :  Admin
Update: 2024-11-01 06:21 GMT

ఏలూరు జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని కూటమి నాయకుల్లో విభేధాలు బగ్గుమన్నాయి. కూటమి మిత్రులు అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు పరస్పర దాడులకు దిగారు. ఏలూరు రూరల్‌ మండలం పైడిచింతపాడులో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. జనసేన నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడులకు దిగారు. ప్రభుత్వం అందించే పెన్షన్‌ పథకం పంపీణీ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యవహార శైలి వల్లే ఈ దాడులు జరిగాయి. తన నియోజక వర్గం పరిధిలోని గ్రామాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలే పెన్షన్‌లను పంచుతారంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ హుకుం జారీ చేశారు.

దీనిపై కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు మింగుడు పడలేదు. తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అధికారంలో తాము కూడా భాగస్వాములుగా ఉన్నామని, పెన్షన్ల పంపిణీలో తాము కూడా పాల్గొంటామని జనసేన శ్రేణులు టీడీపీ నేతలకు తేల్చి చెప్పారు. దీనిని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోయారు. జనసేన నేతల శైలి టీడీపీ నేతలకు కోపం తెప్పించింది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. రెండు గ్రూపుల మధ్య వివాదానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు జనసేన శ్రేణులపై దాడులకు దిగారు. పిడుగుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘర్షణలో పైడి చింతపాడు జనసేన పార్టీ అధ్యక్షుడు మౌరు రామకృష్ణతో పాటు మరి కొందరు జనసేన శ్రేణులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను అత్యవసర చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నేడు ఏలూరు పర్యట ఖరారు కావడం, ఈ ప్రాంతంలో గ్యాస్‌ పథకం ప్రారంభానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని పవన్‌ కళ్యాణ్‌ ఏ మేరకు చల్లారుస్తారు, ఇరు వర్గాలు ఆయన మాట ఏమేరకు వింటారు అనేది తాజాగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News