ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు 2026 షెడ్యూల్‌ను విడుదల విడుదల చేశారు.
By : The Federal
Update: 2025-10-03 15:57 GMT
ప్రస్తుత విద్యా సంవత్సరం 2025–26 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (ఇంటర్) 2026 షెడ్యూల్‌ను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (బీఐఈఏపీ) విడుదల చేసింది. బీఐఈఏపీ కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ షెడ్యూల్‌ను శుక్రవారం (అక్టోబర్ 3) విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం, ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23, 2026 నుంచి ప్రారంభమై మార్చి 24 వరకు జరుగనున్నాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 24 వరకు నిర్వహించబడతాయి. మొత్తం 23 రోజుల పాటు పరీక్షలు జరిగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ షెడ్యూల్ తాత్కాలికమని, పబ్లిక్ హాలిడేస్, పండుగలు (హోలీ, ఉగాడి, రంజాన్ మొదలైనవి) ఆధారంగా మార్పులు రావచ్చని కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు. మార్పులు జరిగినప్పుడు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తాజా సమాచారం అందిస్తామన్నారు.
ప్రాక్టికల్ పరీక్షల వివరాలు
జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్: ఫిబ్రవరి 1 నుంచి 10, 2026 వరకు. రెండు సెషన్లు: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు (ఆదివారాలు సహా) నిర్వహించనున్నారు.
వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10, 2026 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
ఇతర పరీక్షలు
ఎథిక్స్ – హ్యూమన్ వాల్యూస్ పరీక్ష: జనవరి 21, 2026 (బుధవారం), ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష: జనవరి 23, 2026 (శుక్రవారం), ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.
సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ (N ఖఊ లెవల్–4) థియరీ పరీక్ష: ఫిబ్రవరి 13, 2026 (శుక్రవారం), ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.