కడప జిల్లాలో ఘోరం..విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి అగ్గి పెట్టాడు

ఫోన్‌ చేసి నీతో మాట్లాడాలన్నాడు. రాక పోతే చచ్చిపోతానని బెదిరించాడు. వచ్చిన తర్వాత ఆమెపై ప్రెటోల్‌ పోసి నిప్పు పెట్టి పరారయ్యాడు.

Update: 2024-10-19 12:19 GMT

ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్‌తో దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. యువతిని పక్కనే ఉన్న చెట్లల్లోకి తీసుకెళ్లిన యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించడం సంచలనంగా మారింది. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా బద్వేలు సమీపంలోని సెంచురీ ఫ్లైవుడ్‌ పాయింట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థినిని రోడ్డు పక్కనే ఉన్న చెట్లల్లోకి లాక్కెళ్లెన విఘ్నేష్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థినిని కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన బద్వేలు రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో బాధితురాలకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 80 శాతం వరకు గాయాలయ్యాయి.

చిన్న నాటి నుంచి నిందితుడితో బాధితురాలికి పరిచయం ఉంది. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. బద్వేలు రామాంజనేయనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు పరిచయస్తులే కావడంతో కలవాలని విద్యార్థినికి నిందితుడు విఘ్నేష్‌ ఫోన్‌ చేశాడు. కలవకపోతే చని పోతానని ఫోన్‌లో ఆమెను బెదిరంచాడు. ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్టు సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన నిందితుడు విఘ్నేష్‌ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఘటన వివరాలు తెలుసుకున్న బాధితురాలి తండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచే విఘ్నేష్‌ తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఆరోపించారు. విఘ్నేష్‌కు వివాహమైనా తమ కుమార్తె పట్ల వేధింపులు ఆపలేదని, ఇవాళ పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నిందిడి కోసం నాలుగు బృందాలతో గాలింపులు చేపట్టామని కడప జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు.

Tags:    

Similar News