తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే ఇక కేసు !

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత పవిత్రంగా మార్చాలన్న ఆలోచనలో కొత్త టీటీడీ బోర్డు

Update: 2024-11-17 09:01 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ నిబంధన చాలా రోజుల నుంచి ఉంది. కానీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో వారికి పలుకుబడి ఉండడంతో టీటీడీ అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రాజకీయ వ్యాఖ్యల విషయంలో కఠినంగా వ్యవహరించాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు తాజాగా నిర్ణయించింది. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు అని తీర్మానించింది. గత ఐదేళ్లుగా చాలామంది వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువగా రాజకీయాల కోసమే తిరుమలలో మాట్లాడేవారు. మీడియా అటెన్షన్ ఉంటుందని భావించిన వారు ఎక్కువగా తిరుమల వచ్చి రాజకీయాలు మాట్లాడేవారు. అటువంటి నేతల్లో ఆర్కే రోజా ఒకరు. రాజకీయ ప్రత్యర్థులపై తిరుమల నుంచే విమర్శనాస్త్రాలు సంధించేవారు రోజా. పక్క రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం కొండపై రాజకీయాలు మాట్లాడేవారు. అయితే ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా చాలామంది అదే పనిగా మాట్లాడేవారు. వాస్తవానికి తిరుమలలో రాజకీయాలు మాట్లాడడాన్ని ఎప్పుడో నిషేధించారు. కానీ అమలుకు నోచుకోవడం లేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎక్కువమంది నేతలు రాజకీయాలు మాట్లాడే వారు. కానీ ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. భక్తుల మనోభావాలు పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. రేపు టిటిడి ట్రస్ట్ బోర్డుసమావేశం జరగనుంది. పలు కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే. కొండ దిగక ముందే కేసులు పెట్టాలని ఆలోచిస్తుంది టీటీడీ. అయితే ఈ విషయమై కూటమి ప్రభుత్వంలోనే ముందుగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో పాటుఎమ్మెల్యేలకు స్పష్టమైన సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం. తిరుమల కొండపై ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని సూచించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తిరుమల వెళ్తే అంతే భక్తిగా కొండ దిగాలి కానీ. రాజకీయాలు మాట్లాడవద్దని స్పష్టం చేశారు. గతంలో బ్రేక్ దర్శనాలకు భారీ ఎత్తున మంత్రులుతమ వెంట బృందాలను తీసుకెళ్లేవారు. ఇప్పుడు అటువంటిది చేయకూడదని కూడా కూటమి ప్రభుత్వం సొంత ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని టీటీడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే. భక్తుల నుంచి విశేష స్పందన వచ్చే అవకాశం ఉంది.


Tags:    

Similar News