మిగ్ 23 యుద్ధ విమానాన్ని నడుపుతానని చెప్పిన మంత్రి
భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపధ్యంలో తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు;
భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపధ్యంలో తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మిగ్ 23 యుద్ధ విమానాన్ని నడుపుతానని చెప్పారు. చాలా చిన్నవయసులోనే తాను మిగ్ విమానాన్ని నడిపిన విషయాన్ని బయటపెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు ఉత్తమ్(Minister Uttamkumar Reddy) ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. అప్పట్లో తాను మిగ్ 21 యుద్ధ విమానానికి(MIG 21 War fighter) పైలెట్ గా పనిచేసిన విషయాన్ని ఇపుడు బయటపెట్టారు. తాను ఎయిర్ ఫోర్సులో ఉన్నపుడు ఏమి చేశాననే విషయన్ని మంత్రి ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. అలాంటిది పాకిస్తాన్(Pakistan) తో యుద్ధం నేపధ్యంలో ఎయిర్ ఫోర్సుతో తన అనుబంధాన్ని మీడియాతో గుర్తుచేసుకున్నారు. మిగ్ 21 యుద్ధ విమానాన్ని నడిపిన తాను మిగ్ 23 యుద్ధ విమానం నడపటానికి ఎంపికైనట్లు చెప్పారు. శబ్దానికన్నా 2.5 శాతం మిగ్ 23(MIG 23 Fighter) విమానం ప్రయాణిస్తుందన్నారు.
భారత్ కు చెందిన రఫెల్ యుద్ధ విమానాన్ని(Rafale Fighter Jet) కూల్చేసినట్లు పాకిస్తాన్ చెప్పటం పూర్తిగా అబద్ధమన్నారు. ఎందుకంటే రఫేల్ యుద్ధ విమానం పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించనేలేదన్నారు. మన భూభాగంలో నుండే పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపైకి రఫేల్ మిసైల్స్ తో దాడిచేసినట్లు తెలిపారు. ఇపుడు పాకిస్తాన్ గురువారం దాడిచేసిన ప్రాంతాల్లో తాను పనిచేసినట్లు చెప్పారు. తనకు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలన్నీ తెలుసన్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు పహల్గాం(Pahalgam Terror Attack)లో దాడిచేయటం హేయమైన చర్యగా మంత్రి అభివర్ణించారు. కాశ్మీర్లో హిందు, ముస్లిం మధ్య విభేదాలను సృష్టించాలని ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు మంత్రి మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్నపుడు పార్లమెంటు డిఫెన్స్ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.