మాది అక్రమ సంబంధం కాదు.. సక్రమమే అంటున్న మాధురి
దువ్వాడ శ్రీనివాస్‌తో తనకున్న అనుబంధంపై.. తనపై దువ్వాడ వాణి చేస్తున్న ఆరోపణలపై దివ్వెల మాధురి ఘాటుగా స్పందించారు. తనది, శ్రీనివాస్‌ది అక్రమ సంబంధం కాదన్నారు.
‘‘మాది వివాహేతర, అక్రమ సంబంధం కాదు. పెళ్ళి చేసుకుంటే మాది అక్రమ సంబంధం అవుతుంది. కానీ ఇండియాలో అడల్ట్రీ ఇల్లీగల్ కాదు’’ దివ్వల మాధురి చేసిన వ్యాఖ్యలివి. దువ్వాడ శ్రీనివాస్‌తో తనకున్న అనుంబంధం గురించి మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై దువ్వాడ వాణి చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని, తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికే ఆమె ఇలా చేస్తున్నారని మాధురి ఆరోపించారు. వారి కుటుంబ వ్యవహారాలను కుటుంబంతోనే తేల్చుకుంటే మంచిదని, మధ్యలో తన ప్రతిష్టను భ్రష్ట పట్టించడం ఏమాత్రం బాగోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ వాణి చేసిన ఆరోపణలకు ఆమె ఈరోజు బదులిచ్చారు. తనకు, దువ్వాడ శ్రీనివాస్‌కు మధ్య ఏమీ లేదని, తమది ఇల్లీగల్ ఎఫైర్ కాదని స్పష్టం చేశారు.
‘టికెట్ కోసం భర్తను వదులుకున్న మహిళ వాణి’
‘‘దువ్వాడ వాణి.. అసెంబ్లీ టికెట్ కోసం తన భర్తను వదులుకోవడానికి రెడీ అయ్యారు. తనకు భర్త వద్దు టికెట్టే ముద్దు అని వైసీపీ అధిష్టానం ముందు తేల్చి చెప్పారు. ఆమె చేసిన ఆరోపణల కారణంగా నా భర్త నన్ను వద్దని, విడాకులు ఇస్తానని వెళ్లిపోమన్నారు. దాంతో నేను ఆత్మహత్యే శరణ్యం అనుకున్న సమయంలో నాకు అండగా నిలబడిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆయన నాకో ఫ్రెండ్, ఫిలాసఫర్. ఆయన చాలా నిజాయితీ పరుడు. ఆయనను ట్రాప్ చేయడానికి ఆయన దగ్గర ఆస్తులేమీ లేవు. ఆయనకు ఉన్న ఆస్తులన్నింటిని కుటుంబానికే రాసిచ్చారు. ఆయన దగ్గర ఇంకేమి ఆశించి ట్రాప్ చేస్తాం. దువ్వాడ శ్రీనివాస్ ఎలక్షన్ కోసం నేను దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టాను. ఈ విషయం అందరికీ తెలుసు’’అని వెల్లడించారు.
మాది ఎఫైర్ కాదు..
‘‘ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు నాకుంది. నాది, దువ్వాడ శ్రీనివాస్‌ది ఇల్లీగల్ ఎఫైర్ కాదు. మేము పెళ్ళి చేసుకుని ఉంటే అది ఇల్లీగల్. కానీ మేము పెళ్ళి చేసుకోలేదు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే.. భర్తతో కూర్చుని మాట్లాడుకోని వాటిని పరిష్కరించుకోవాలి. అయినా రెండేళ్లుగా ఆమెకు భర్త ఎందుకు గుర్తుకు రాలేదు. ఆమె ఇప్పటికి కూడా రాజకీయ లబ్ది పొందాలనే నన్ను, దువ్వాడను టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు. అందుకే నేను బయటకు వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నన్ను క్యారెక్టర్ లేని మహిళ అని చెప్పి, దానిని మీడియా అంతా ప్రచారం చేస్తే అది నా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఎలాగూ ఏమీ లేకపోయినా.. నాపై తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి ఇకపై నేను దువ్వాడతోనే ఉంటా’’ అని స్పష్టం చేశారు.
రెండేళ్లు ఏమయ్యారు
‘‘తండ్రీ.. తండ్రీ అంటున్న దువ్వాడ శ్రీనివాస్ పిల్లు ఈ రెండేళ్లు ఏమైపోయారు. వాణి చేసిన పనికి దువ్వాడ కొన్ని రోజులు రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో పిల్లలు ఎక్కడున్నారు. ఏమైపోయారు. దువ్వాడ శ్రీనివాస్‌ను వాణి ఇంట్లోకి కూడా రానివ్వకపోతే.. అప్పుడు నేను ఇంట్లోకి రాణించాను. ఆయన దగ్గర ఏమీ లేదు ఆయనను నేనెందుకు ట్రాప్ చేస్తాను. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మా ఆయన నెల రూ.10 లక్షల జీతం సంపాదిస్తారు. మా కుటుంబం కూడా ఆర్థికంగా చాలా మంచి స్థానంలో ఉంది. అవన్నీ వదులుకుని ఏమీ లేని దువ్వాడను ఎందుకు ట్రాప్ చేస్తాను. అంత అవసరం నాకేముంది’’ అని ప్రశ్నించారు.
గన్‌కు లైసెన్స్ ఇవ్వండి: దువ్వాడ
ఒకవైపు దువ్వాడ ఇంటిపోరు రచ్చకెక్కి తీవ్ర దుమారం రేపుతుంటే మరోవైపు తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాస్.. పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. తన దగ్గర తుపాకీ ఉందని.. అందుకు లైసెన్స్ ఇవ్వాలంటూ ఆయన ఎస్పీ మహేందర్‌ను కోరారు. తనకు కొంత మంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, మరికొందరు తన ఇంటి దగ్గర అనుమానకరంగా రెక్కీ నిర్వహిస్తున్నారని, తనకు ప్రాణాలకు హాని ఉన్నందునే తుపాకీకి లైసెన్స్ అడుగుతున్నానని ఆయన బుధవారం కోరారు.