‘జయభేరి’కి హైడ్రా నోటీసులు

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కీలకనేతల్లో ఒకరైన సినీనటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు జారీచేసింది.

Update: 2024-09-08 03:38 GMT

చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కీలకనేతల్లో ఒకరైన సినీనటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు జారీచేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల మురళీమోహన్ జయభేరి కన్సస్ట్రక్షన్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలుగా నటుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నగరంలో దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంచేస్తున్న ప్రముఖ సంస్ధల్లో జయభేరి కూడా ఒకటి. అలాంట జయభేరి నిర్మాణాలను కూల్చేస్తామని హైడ్రా నోటీసులు జారీచేయటం సంచలనంగా మారింది.

గ్రేటర్ పరిధిలో కుచించుకుపోయిన చెరువులు, కాల్వలు, కుంటలతో పాటు ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్ధలాలను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుండి తన లక్ష్యాలకు తగ్గట్లుగానే అక్రమనిర్మాణాలను కూల్చేస్తోంది. చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. తుమ్మడికుంట చెరువును ఆక్రమించి ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. తర్వాత రాజకీయనేతలకు చెందిన ఫాంహౌసులు, విద్యాసంస్ధలను కూల్చేస్తామని నోటీసులు జారీచేసింది. దాంతో జనాలందరు హైడ్రాకు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నారు.

ఇపుడు ప్రస్తుత విషయానికి వస్తే జయభేరి కూడా గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ చెరువును ఆక్రమించి అపార్టమెంట్లు నిర్మించిందంటు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. నగరంలో జయభేరి పేరుతో జరిగిన చాలా నిర్మాణాల్లో ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. దాంతో హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ తన సిబ్బందితో రంగలాల్ చెరువును పరిశీలించారు. బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ నిబంధనలను అతిక్రమించి జయభేరి అపార్టుమెంట్లను నిర్మించినట్లు సర్వేలో తేలింది. దాంతో వెంటనే జయభేరి యాజమాని మురళీమోహన్ కు హైడ్రా నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో ఆక్రమణలను తొలగించకపోతే హైడ్రాయే కూల్చేస్తుందని నోటీసుల్లో స్పష్టంగా ఉంది. మరి సినీనటుడు హైడ్రా చెప్పినట్లుగా ఆక్రమణలను తొలగిస్తారా ? లేకపోతే కోర్టులో చాలెంజ్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News