హైడ్రా మరో సంచలనం..225 మందికి నోటీసులు

ప్రముఖ సినీనటుడు, హీరో అక్రినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను శనివారం కూల్చేసిన హైడ్రా ఆదివారం మరో సంచలంరేపింది.

Update: 2024-08-25 06:35 GMT

హైడ్రా మరో సంచలనానికి తెరలేపబోతోందా ? అందరిలోను ఇపుడిదే టెన్షన్ పెరిగిపోతోంది. ప్రముఖ సినీనటుడు, హీరో అక్రినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను శనివారం కూల్చేసిన హైడ్రా ఆదివారం మరో సంచలంరేపింది. అదేమిటంటే మణికొండ ప్రాంతంలో చాలామంది సినీ ప్రముఖులు ఉంటున్న చిత్రపురి కాలానీలోని 225 మందికి నోటీసులు జారీచేసింది. మణికొండ మున్సిపల్ కమీషనర్ తరపున 225 విల్లా యజమానులకు నోటీసులు అందాయి. చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు ఎలాంటి అనుమతులు లేవని కమీషనర్ నోటీసుల్లో స్పష్టంగా చెప్పారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమీషనర్ నోటీసులో చెప్పారు.

15 రోజుల్లోగా సమాధానాలు చెప్పకపోతే కూల్చివేతలు తప్పవని నోటీసులు జారీచేసిన సిబ్బంది సినీ ప్రముఖులకు చెప్పినట్లు సమాచారం. హైడ్రా తరపున మణికొండ మున్సిపల్ కమీషనర్ 225 మంది ప్రముఖులకు నోటీసులు జారీచేశారు. జీవో 658కి విరుద్ధంగా రోహౌజుల పేరుతో చిత్రపురి కాలనీలో చాలామంది ప్రముఖులు విల్లాలు నిర్మించుకున్నారు. విల్లాలు నిర్మించుకుని కూడా చాలా సంవత్సరాలవుతోంది. ఇంతకాలం అక్రమనిర్మాణాలని తెలిసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు హైడ్రా ఏర్పాటైన తర్వాత గ్రేటర్ పరిధిలోని ప్రముఖుల ఫాంహౌసులు, అక్రమనిర్మాణాలు, అక్రమంగా నిర్మించిన కాలనీలు, చెరువులు, కుంటల ఆక్రమణల వివరాలను హైడ్రా సేకరిస్తోంది. ఇరిగేషన్, రెవిన్యు, జీహెచ్ఎంసీ, హెఎండీఏ ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతు అక్రమనిర్మాణాల వివరాల సమాచారాన్ని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే ఎన్ కన్వేన్షన్తో పాటు జన్వాడలో కేటీఆర్ ఫాం హౌస్ లాంటివి చాలావరకు అక్రమంగా నిర్మించినట్లు బయటపడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేసిన హైడ్రా ఇపుడు చిత్రపురి కాలనీలో ఉంటున్న 225 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసింది. చిత్రపురి కాలసీ సోసైటి కొన్నింటి నిర్మాణాలను అనుమతులు తీసుకుని ఇష్టంవచ్చినట్లు నిర్మాణాలు చేయించేసింది. అలాగే జీ+1 అంతస్తుకు అనుమతి తీసుకుని జీ+2 అంతస్తులు కట్టేసినట్లు మణికొండ మున్సిపల్ అధికారులు గుర్తించారు. చిత్రపురి కాలనీ నిర్మాణాలపై చాలా ఫిర్యాదులున్నాయి. అలాంటి ఫిర్యాదులను ఇపుడు హైడ్రా కారణంగా మున్సిపాలిటీలు, పంచాయితీలు దుమ్ము దులిపి బయటకు తీస్తున్నాయి. చిత్రపురి కాలనీలో ప్రముఖులు ఎవరెవరు ఉంటున్నారు ? ఎవరెవరు నిబంధనలను ఉల్లంఘించారనే విషయం తొందరలోనే బయటపడుతుంది.

Tags:    

Similar News