కొన్ని దశాబ్ధాల క్రితమ తిరుమల ఎలా ఉండేది చుడండి

Update: 2024-10-09 08:09 GMT

శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శతాబ్దాలుగా విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులకు దర్శనీయ స్థలంగా భాసిల్లుతోంది.

పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర చక్రవర్తులతో సహా అనేక మంది రాజులు రాజవంశాలతోపాటు 20వ శతాబ్దం ప్రారంభంలో మహంతుల హయాం వరకు శ్రీవారి ఆలయంలో అద్భుతమైన శిల్పాలు, ఎతైన గోపురాలు, పవిత్ర మందిరాలు రూపుదిద్దుకున్నాయి.తిరుమలకు వెళ్లేందుకు డోలీలు తప్ప ఎలాంటి ఇతర రవాణ వసతులు లేని కాలంలో 1932-33లో టిటిడి ఆవిర్భావంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తప్పక దర్శించుకోవాలనుకునే క్షేత్రంగా తిరుమల అభివృద్ధి చెందింది. ఒక సంవత్సరంలో తిరుమలను దర్శించుకునే  యాత్రికుల సంఖ్య 2.75 కోట్లుగా నమోదైంది.

తిరుమల ఆలయ ప్రధాన ద్వారం మహాద్వారం. దీనిని పడికావిలి మహాద్వారం అని కూడా పిలుస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి ఆలయంలోని మహాద్వారం చిత్రం.




చారిత్రక ఆధారాల ప్రకారం 1470లో విజయనగర రాజు సాళువ నరసింహరాయలచే ధ్వజస్తంభ మండపం నిర్మించబడింది. తిరుమల ఆలయంలోని రెండవ గోపురంతో నిర్మితమైన ఈ మండపంలో పది స్తంభాలున్నాయి.



పాత రోజుల్లో దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు.


ఆనంద నిలయ విమాన గోపురంలో బంగారు పూత లేకుండా దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి వెండి ప్రతిమ. పాత ఫోటో



ప్రధాన గోపురంతో పాటు బంగారు పూత లేకుండా ఉన్న ఆనంద నిలయం విహంగ వీక్షణం.



అన్నప్రసాదం పేరుతో రోజుకు దాదాపు లక్ష మంది యాత్రికులకు ఆహారాన్ని అందిస్తున్న అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టిటిడి. తొలి రోజుల్లో నేలపై అన్నప్రసాదం వడ్డించేవారు. అలనాటి ఫోటో.



ఊంజల్ సేవ ఒక ఊయల పండుగ. ఇది తొలినాళ్లలో ఆలయం లోపల జరిగేది.



నాడు-పాతరోజుల్లో గుడి లోపల భక్తులకు అందజేస్తున్న లడ్డూ ప్రసాదం.



గతంలో ఇళ్లతో ఇరుకుగా ఉన్న నాలుగు మాడ వీధులు. ఫైల్ ఫోటో

 


వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల ఆలయం ముందు వెళ్తున్న సర్వభూపాల వాహనం- ఫైల్ ఫోటో



పూర్వకాలంలో బ్రహ్మోత్సవాల్లో శ్రీ మలయప్ప స్వామివారి జగన్మోహిణి అలంకారం.



వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది, పూర్వకాలంలో టీటీడీ వెండి రథంపై రథోత్సవం నిర్వహించేది.

 


వసంతోత్సవం ఏడాదికోసారి జరిగే ఉత్సవం- పూర్వకాలంలో ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీరామ, శ్రీమలయప్పస్వామి మరియు శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు.



పవిత్రమాలలో దర్శనమిస్తున్న శ్రీ మలయప్పస్వామి. పాత ఛాయాచిత్రం.



పూర్వపురోజుల్లో ఇరుకుగా దర్శనమిస్తున్న మహాద్వారం ముందుభాగం.

 


తిరుమల పాత బసు

 


శ్రీవారి ఆలయాన్ని సందర్శించేందుకు మద్రాస్ నుండి వచ్చిన బ్రిటిష్ అధికారులు



తిరుమలలోని శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పాత ఇళ్ల అరుదైన చిత్రం

 


అలిపిరి కాలిబాట దృశ్యం, రెండు సోపాన మార్గాలలో ఇది ఒక్కటి. దాదాపు 11కి.మీ పొడవున్న ఈ మార్గం ప్రారంభ రోజులలో పూర్తిగా నిర్మానుషంగా కనిపిస్తున్న దృశ్యం








 




 


 


 


 


 


 




Tags:    

Similar News