అమరావతి కోసం ఎన్ని దేశాలు తిరుగుతావు నారాయణా
అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఇంకా విదేశీ పర్యటనలు చేస్తూనే ఉంది.
Byline : Vijayakumar Garika
Update: 2025-09-28 12:49 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు 7 దేశాల్లో పర్యటనలు చేసి, సుస్థిర నగర నిర్మాణ విధానాలు, పెట్టుబడుల సాధనపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ, ఐటీ మంత్రి నారా లోకేష్, అధికారులు కలిసి 2014–2019లోను, 2024 తర్వాత కాలంలో ఇప్పటి వరకు మొత్తం 10కి పైగా సార్లు విదేశాలు పర్యటించారు. ప్రస్తుతం మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ అధికారులు దక్షిణ కొరియా దేశంలో పర్యటిస్తున్నారు. మంత్రి నారాయణతో పాటు మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా ఈ పర్యటనలో ఉన్నారు.
సింగపూర్ కు అత్యధిక సార్లు (కనీసం 4–5 సార్లు) పర్యటించారు. 2014–2019లో మాస్టర్ ప్లాన్ కోసం సైన్ చేశారు. పెట్టుబడులు తెస్తామని 2025 జూలై 26–31 మధ్య చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకేష్ డెలిగేషన్ పర్యటించింది. ప్రత్యేక విమానంలో పర్యటించారు. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్టోర్, హౌసింగ్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ. అవుట్‌కమ్: రూ.45,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. 2015 డిసెంబర్‌లో మంత్రి నారాయణ డెలిగేషన్ చైనాలో పర్యటించారు. 2015లో అధికారుల డెలిగేషన్ జపాన్‌లో పర్యటించి, బెస్ట్ ప్రాక్టీసెస్, స్మార్ట్ సిటీ మోడల్స్ అధ్యయనం కోసమని వెళ్లారు. 2015లో రష్యా పర్యటనకు వెళ్లారు.
పర్యాటకం, ఇన్‌ఫ్రా మోడల్స్ అధ్యయనం కోసమని 2015లో డెలిగేషన్ మలేషియా విజిట్ చేసింది, 2017 అక్టోబర్ 20న చంద్రబాబు నాయుడు, అధికారులు అమెరికా న్యూయార్క్ పర్యటించారు. బిజినెస్ హౌసెస్, టెక్నాలజీ ఫరŠమ్స్‌తో ఇంటరాక్టివ్ సెషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చర్చలు చేశారు. తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ వెళ్లారు. 2014–2019లో చంద్రబాబు హయాంలో జరిగిన ఈ పర్యటనలు 2024 తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. వైసీపీ హయాంలో 2019–2024 అమరావతి ప్రాజెక్టు ఆగిపోయినందున విదేశీ పర్యటనలు లేవు. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్, సింగపూర్ వంటి భాగస్వాములతో సహకారం పుంజుకుంటోందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. విదేశీ మోడల్స్ ద్వారా అమరావతిని బ్లూ–గ్రీన్ సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నట్టు చెబుతోంది. మరో వైపు అమరావతి కోసం విదేశీ పర్యటలను చేస్తూనే ఉన్నారు.