బీఆర్ఎస్ ఆఫీసు కూల్చివేతకు ఆదేశం

15 రోజుల్లోనే కూల్చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే లక్ష పరిహారం కూడా చెల్లించాలని ధర్మాసనం తీర్పిచ్చింది.

Update: 2024-09-18 08:48 GMT

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని తెలంగాణా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఆఫీసుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆపీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు తగ్గట్లే అధికారులు పార్టీ ఆఫీసుకు కూల్చివేత నోటీసులు జారీచేశారు. ఆ నోటీసుల ఆధారంగా పార్టీ కోర్టులో కేసు వేసింది. ఆ కేసును బుధవారం ధర్మాసనం విచారించింది. అనుమతులు తీసుకోకుండానే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పార్టీ బాధ్యులు పార్టీ ఆఫీసును నిర్మించినట్లు అధికారులు కోర్టుకు చెప్పారు. మొదట్లో అధికారుల వాదనతో విభేదించిన పార్టీ నేతలు తర్వాత అక్రమ నిర్మాణాలను రెగ్యులర్ చేసేట్లుగా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు.

ఎప్పుడైతే పార్టీ నేతలు రెగ్యులరైజేషన్ కు విజ్ఞప్తి చేశారో వెంటనే కోర్టు మండిపోయింది. అనుమతులు లేకుండానే పార్టీ ఆఫీసు నిర్మించినట్లు ఒప్పుకుంటున్నారంటే అది అక్రమ నిర్మాణమే కదాని కోర్టు బీఆర్ఎస్ నేతలను నిలదీసింది. అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాత భవనాన్ని నిర్మించుకోవాలి కాని భవనాన్ని నిర్మించేసుకుని ప్రభుత్వం మారిన తర్వాత ఇపుడు రెగ్యులరైజ్ చేయమని అడగటం ఏమిటని వాయించేసింది. పార్టీ భవనం నిర్మాణం అక్రమమని తేలిపోయింది కాబట్టి 15 రోజుల్లోనే కూల్చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే లక్ష పరిహారం కూడా చెల్లించాలని ధర్మాసనం తీర్పిచ్చింది.

Tags:    

Similar News