చంద్రబాబు కేబినెట్ మంత్రులు వీళ్లేనా..!

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ కేబినెట్ మంత్రులు ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారుతోంది.

Update: 2024-06-10 10:29 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ కేబినెట్ మంత్రులు ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు పలానా శాఖ ఆ నేతకి, పలానా శాఖ ఈ నేతకంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఈ ప్రచారాలు జోరు ఎన్నికల ఫలితాల కన్నా ఎక్కువగానే ఉంది. ఇందులో జనసేని పవన్ కల్యాణ్‌కు హోం శాఖ రానుందని, లోకేష్‌కు మళ్ళీ ఐటీ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇన్ని రకాల ప్రచారాలు జరుగుతుంటడంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనేది మిలియల్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉన్న పదవులు 20 ఆశావాహులు 50కి పైనే ఉన్నారు. వీరిలో కొమ్ములు తిరిగిన సీనియర్లు కూడా ఉండటం గమనార్హం. ఈ రేసులో అత్యధిక ఆశావహులు టీడీపీ నుంచే ఉన్నారు. దీంతో మిత్ర పక్షాలైన బీజేపీ, జనసేనకు మంత్రి మండలిలో ఏమేరకు స్థానం లభిస్తుందనేది చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రివర్గ కూర్పు టీడీపీ పెద్దలకు కత్తిమీద సాములా మారిందనేది విశ్వసనీయ వర్గాలు చెప్తున్న మాట.

సోషల్ మీడియాలో తెగ వైరల్

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ మంత్రులపై సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు షికార్లు కొడుతుంటే వాటన్నింటిలోకి ఒక్కటి మాత్రం అత్యధిక మంది ప్రజల దృష్టి ఆకర్షిస్తుంది. కొందరు నిపుణులు కూడా ఈ లిస్ట్‌కు ఓకే చెప్తున్నారు. కాకపోతే ఈ లిస్ట్‌లో కొన్ని జిల్లాల నుంచి ఎవరికి స్థానం కల్పించకపోవడం, మంత్రి పదవి ఆశిస్తున్న కొందరు సీనియర్ల పేర్లు లేకపోవడం గమ్మత్తుగా ఉంది. అయితే ఇందులో జనసేనకు నాలుగు, బీజేపీ రెండు మంత్రి పదవులు కేటించబడి ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లిస్ట్ ఒక ఊపు ఊపేస్తుంది. ఇదే ఒరిజినల్ లిస్టా అన్న సందేహాలను కూడా కొందరు రైజ్ చేస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటివరకు టీడీపీ స్పందించకపోవడం మరిన్ని అనుమానలకు తావిస్తోంది.

అసలు లిస్ట్ ఎలా ఉందంటే..

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోంశాఖ

నారా లోకేష్- మున్సిపల్ & ఐటీశాఖ

కింజరాపు అచ్చెన్నాయుడు - ఆర్థికశాఖ

నిమ్మకాయల చినరాజప్ప -

గోరంట్ల బుచ్చయ్య చౌదరి పౌరసరఫరాలశాఖ

పితాని సత్యనారాయణ - బీసీ వెల్ఫేర్

రఘురామ కృష్ణరాజు - స్పీకర్

బొండా ఉమామహేశ్వరరావు- రవాణా & రోడ్లు, భవనాలశాఖ

ఆనం రాంనారాయణరెడ్డి నీటిపారుదలశాఖ

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయశాఖ

పయ్యావుల కేశవ్ - రూరల్ డెవలెప్మెంట్

పరిటాల సునీత - ఉమెన్ & ఫ్యామిలీ వెల్ఫేర్

నందమూరి బాలకృష్ణ సినిమాటోగ్రఫీ

పొంగూరు నారాయణ విద్యాశాఖ

గంటా శ్రీనివాసరావు - పంచాయతీరాజ్

చింతకాయల అయ్యన్నపాత్రుడు - అటవీ & పర్యావరణశాఖ

భూమా అఖిలప్రియ టూరిజం & సాంస్కృతిక శాఖ

మహ్మద్ షారూఖ్ - మైనార్టీ

నాదెండ్ల మనోహర్ - పరిశ్రమలు ( జనసేన)

మండలి బుద్ద ప్రసాద్ - పశుసంవర్థకశాఖ (జనసేన)

కామినేని శ్రీనివాస్ - వైద్య ఆరోగ్యశాఖ (బీజేపీ)

విష్ణకుమార్ రాజు - దేవాదాయశాఖ (బీజేపీ)

కొణతాల రామకృష్ణ - విద్యుత్శాఖ ( జనసేన)

జ్యోతుల నెహ్రూ - ఎక్సైజ్ శాఖ

ఇదంతా అబద్దం

అయితే ఈ జాబితాను ఇదంతా ఫేక్ అని కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం మంత్రివర్గం విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారని వారు చెప్తున్నారు. సామాజిక వర్గాలు, జిల్లాల వారీగానే కాకుండా యువత, మహిళల ప్రాధాన్యతకు కూడా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని, అందుకే కేబినెట్ కూర్పు ఇంత ఆలస్యం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గ కూర్పుకు సమయం ఎక్కువ పడుతుందని, అందుకని జూన్ 12న కేవలం ముఖ్యమంత్రే ప్రమాణ స్వీకారం చేస్తారా? లేకుంటే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? అనేది అంశంపై కూడా స్పష్టత లేదని వారు అంటున్నారు. మరి ఈ సస్పెన్స్ తీరాలంటే ప్రమాణ స్వీకారం వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News