చేనేతకు మళ్లీ అన్యాయం జరుగుతోంది, బాబూ!

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చేనేత కడుపు కోత లేఖ,;

By :  Admin
Update: 2024-12-11 06:39 GMT

అయ్యా!

తమరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన 1995 నాటినుండి 2004 వరకు 9 సం॥ల 6 నెలల సుదీర్ఘ కాలము విధులను నిర్వర్తించి హైదరాబాద్ రాజధానిని ప్రపంచ పటంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడి, లక్షలాది సాంకేతిక యువ నిపుణుల ఉద్యోగ కల్పనకు తోడ్పడిన మీరు ఎంతో అభినందనీయులు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మీ సేవలను సదా గుర్తించుకోవాలి.

దురదృష్టవశాత్తు ఉమ్మడి రాష్ట్రంలో 1997 నుండి 2004 వరకు, చేనేత పరిశ్రమకు మరియు చేనేత కళాకారుల కుటుంబాలకు జరిగిన అన్యాయము, దశాబ్దాల కాలం వరకు, ఏ ప్రభుత్వం పూడ్చలేని విధంగా అప్పటి చేనేత శాఖామంత్రి, ఎన్నుకోబడిన ఆప్కో మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆప్కో, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి ఏకమై అక్రమ సంపాదనకు పాల్పడి ఆప్కోలో చేసిన నేరాలు ఘోరాలు,

1. 340 ఆప్కో విక్రయశాలలతో, 1400కు పైబడిన ప్రాథమిక సహకార సంఘాల సభ్యుల, విభిన్నమైన వస్త్ర రకాల ఉత్పత్తితో, 3500 ఆప్కో ఉద్యోగులతో కళకళలాడుతూ, దేశంలోని రాష్ట్రస్థాయి సహకార సంఘాల విక్రయాలలో రెండవ స్థానం, వస్త్ర ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచి, స్వర్ణ యుగంగా మారిన చేనేత పరిశ్రమ రంగం, సర్వ నాశనమైన, మీరు పదవిని చేపట్టిన 1995 నుండి 2004 వరకు జరిగిన అవక తవకులు, అవినీతి అక్రమాలు గురించి, ఇంతకుమునుపే నా వేలాది ఉత్తరాలలో తెలియజేశాను. కానీ మీరు స్పందించలేదు.

1. 1997లో ఆప్కో మేనేజింగ్ కమిటీకి ఎన్నికలు జరిగి ఆప్కో చైర్మన్ గా, అప్పటికే చేనేత శాఖామంత్రి గారి సలహాతో, మీరు మండల శ్రీరాములు గారిని నియమించారు. వారిరువు కలిసి కోట్లాది రూపాయల విక్రయాలు జరుపుతున్న , దేశంలోని ముఖ్యమైన పట్టణాల విక్రయశాలలతో కలిపి, అభివృద్ధి పథంలో నడుస్తున్న 140 విక్రశాలలను, 70 కోట్ల రూపాయల అక్రమ పగిడి పొంది, మూయించి వేశారు.

ఫలితంగా సగానికి సగము విక్రయాలు తగ్గిపోయి, సగానికి పైగా చేనేత సహకార సంఘాల సభ్యులు తమ వృత్తిని కోల్పోయి, ఆకలి చావులకు ఆత్మహత్యలకు పాల్పడిన దుర్ఘటనలను మీ దృష్టికి తేవడం జరిగింది. కానీ మీరు స్పందించలేదు. చేనేత కళాకారులు మీపై పూర్తి విశ్వాసాన్ని కోల్పోయారు.

2. మీరు చేనేత పరిశ్రమకు వార్షిక బడ్జెట్లో కేటాయించవలసిన నిధులను పూర్తిగా తగ్గించి చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారు.

3. దివంగత ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన చేనేత కళాకారులకు ఉపాధి కల్పించుటకు మరియు బలహీన వర్గాల పేద ప్రజలకు సగం ధరకే జనతా వస్త్రాలను సరఫరా చేయుటకు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల స్కీం నిలుపుదల కావడానికి కారణం.

4. సంవత్సరం పొడుగునా అన్ని పండుగల సీజన్లలో, ఆప్కో విక్రయశాలలో జరిపే రిటైల్ అమ్మకాలపై, మరియు చేనేత సహకార సంఘాలు జరిపే విక్రయాలకు 20% రిబేట్ నిలుపుదలకు మీరు కారణము.

5. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ మరియు ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగులకు అనుమతిస్తున్న ఆప్కో క్లాత్ లోనును ( GO Non-Go Sales ) పూర్తిగా నిలుపుదల చేసిన కారణంగా, సగానికి సగం పైగా ఆప్కో విక్రయాలు తగ్గి, ఆమేరకు సొసైటీలకు ఉత్పత్తి ప్రోగ్రాం తగ్గి తమ వృత్తిని కోల్పోవడం

6. హోల్సేల్ సేల్స్ పై అప్కో అమలు చేస్తున్న డిస్కౌంట్ను పూర్తిగా తొలగించడం వలన విక్రయాలు తగ్గిపోవడం,

7. 2002-2003 లో అప్పటి ఆప్కో ఎండి గారు మరియు పరిశ్రమల శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో, మంగళగిరిలోని ఆప్కో సంస్థకు కు చెందిన, అప్పటి విలువ ప్రకారము 6 కోట్ల రూపాయలు విలువచేసే 6 ఎకరాల స్థలాన్ని 1.60 కోట్ల రూపాయలకు, సింగిల్ బిడ్ కు, బిడ్డర్ తో లాలూచీపడి అంగీకరించి, 3.40 కోట్ల రూపాయలు అక్రమ లబ్ధి పొంది పంచుకున్న విషయం. మీ దృష్టికి వచ్చినప్పుడు వారి చర్యను తీవ్రంగా ఖండించవలసిన మీరు, అనుమతించిన విషయము చేనేత పరిశ్రమ రంగానికి పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఆ స్థలం విలువ 200 కోట్ల రూపాయలు.

8. నల్గొండ జిల్లాలో చేనేత కార్మికుల ఆకలి చావులకు ఆత్మహత్యలకు స్పందించిన అప్పటికేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి, రివాల్వ్ ఫండ్ ఏర్పాటుచేసి, సహకార సంఘాల గోదాములలోను, మాస్టర్ వీవర్స్ వద్ద నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేశారు. ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ శర్మ గారు,
దేశం మొత్తం మీద అమ్ముడు కాకుండా పోయినటువంటి, వస్త్రాలను తెప్పించి అక్రమ లబ్ధి పొంది కొనుగోలు చేయించి, తక్కువ రేటుకి అమ్మించి, వేలము వేయించి కోట్లాది రూపాయలు ఆప్కో కు నష్టం తెప్పించారు. ఆ విషయమై నేను లోకాక్తులో కంప్లైంట్ చేశాను. మీరు కల్పించుకుని అతనికి శిక్ష పడకుండా తప్పించారన్న అభియోగాలు అప్పుడు మీ పై మోపబడిన విషయము మీకు తెలియజేశాను కానీ మీరు స్పందించలేదు.

ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో 20 శాతం గా ఉన్న చేనేత కళాకారులు, ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీపై నమ్మకము పోగొట్టుకొని, 2004వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలిపించి, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గ ఎన్నిక కావడానికి సహకరించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి? గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు కనిపిస్తోంది? ఎవరికి తగ్గాయి? ఎవరికి పెరిగాయి? అన్నది చూద్దాం.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏకంగా 53 లక్షల 72 వేల 166 ఓట్ల తేడా ఉంది. ఒక్క టీడీపీతో పోల్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 21లక్షల 442 ఓట్లు తక్కువ పడ్డాయి.

ముఖ్యమంత్రి గారు కూటమికి వైఎస్ఆర్సిపి కి మధ్య తేడా 21 లక్షల 442 ఓట్ల తేడా మాత్రమే. 75 లక్షల చేనేత కళాకారుల ఓట్లు మొత్తము మీ కూటమికే పడ్డాయి. 75 లక్షల ఓట్లలో 11 లక్షల చేనేత కళాకారుల ఓట్లు వైఎస్సార్సీపీకి వేసి ఉంటే కూడా మీరు ఘోరంగా ఓడిపోయేవారు.

2014 వ సార్వత్రిక ఎన్నికలలో 75 లక్షల చేనేత కళాకారుల ఓట్లు పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేయడంతో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి 25 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. కాపులు జనసేనకు ఓటు వేసినందున తెలుగుదేశం ఓడిపోయినట్లు చేసిన విశ్లేషణ అక్షరాల సత్య దూరం. కేవలము మూడు శాతం కలిగిన కాపు కమ్యూనిటీ ఓట్లు వేయనంతమాత్రాన మీరు ఓడిపోయారు అన్నది శుద్ధ అబద్ధం.

చేనేత పరిశ్రమను, పవర్ మగ్గాల యాజమాన్యాలకు తాకట్టుపెట్టి, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని, మరియు ఆప్కో బైలాను మరియు రాజీవ్ విద్యా మిషన్ పథకం ఉత్తర్వులు ఉల్లంఘించి, చేనేతకు కేటాయించిన 11 రకాల వస్త్రాలను మరియు యూనిఫామ్ దుస్తుల ఉత్పత్తి కొరకు కేటాయించిన రకాలను, మరమగ్గాల పై ఉత్పత్తి చేసుకొనుటకు అవకాశం ఇచ్చినందున, 30 లక్షల చేనేత కళాకారుల జీవనోపాధిని పోగొట్టి వారి ఆకలి చావులకు ఆత్మహత్యలకు కారకులైనందున, నేత కమ్యూనిటీకి చెందిన 75 లక్షల ఓట్లను 2019 లో వైయస్సార్సీపీకి వేసి గెలిపించిన విషయమును మీరు పూర్తిగా గ్రహించలేకపోతున్నారు.

2019లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ మగ్గాల యాజమాన్యాల తో కుమ్మకై, మీ ప్రభుత్వం కన్న ఘోరంగా చేనేత పరిశ్రమకు చేనేత కళాకారులకు ద్రోహం చేసినందున మరియు వారి ఆకలి చావులకు ఆత్మహత్యలకు కారకులైనందున చే నేత. కళాకారులందరికి దూరమైపోయాడు.

శ్రీ నారా లోకేష్ గారు తన పాదయాత్రలో చేనేత నాయకుల సేవలను ఉపయోగించుకుని చేనేతను అభివృద్ధి పథంలో నడుపుతానని వాగ్దానాలు చేసిన కారణంగా నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు.

దురదృష్టవశాత్తు ముఖ్య చేనేత నియోజకవర్గాలైన మంగళగిరి ధర్మవరం నియోజకవర్గాల నుండి నిలబడి గెలిచి మంత్రులైన శ్రీ నారా లోకేష్ గారు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు పూర్తిగా చేనేత పరిశ్రమకు చేసిన వాగ్దానాలను మరచి వారికి కేటాయించిన శాఖల అభివృద్ధి కొరకు ప్రయత్నిస్తున్నారు.

తర్వాత స్థానంలో ఉన్న ముఖ్య చేనేత కేంద్రాలైన పిఠాపురం నుండి ఎన్నికైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు ఉరవకొండ నియోజకవర్గం నుండి గెలుపొంది ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు చేనేత కళాకారుల ఓట్లతో గెలుపొంది, చేనేత పరిశ్రమను మరిచిపోయి, వార్షిక బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన దివంగత ఎన్టీ రామారావు ఆశయాలకు విరుద్ధంగా చేనేత పరిశ్రమకు ద్రోహం చేయడం చరిత్ర సహించదు.
ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి.
ఈ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. ‌‍ఇందులో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11స్థానాలకే పరిమితం అయ్యింది.
మెజార్టీల పరంగానూ టీడీపీ, జనసేన, బీజేపీ అ‌‍భ్యర్థులు ‌‌‌భారీ విజయాలను నమోదు చేశారు. టీడీపీకి చెందిన పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, నారా లోకేష్.. ఏకంగా 91వేలకుపైగా మెజార్టీ సాధించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ప్రకటించిన లెక్కలను బట్టి చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 55.29శాతం ఓట్లు సాధించాయి.
మూడు పార్టీలు కలిపి 1 కోటి 86 లక్షల 56 వేల 300 ఓట్లు దక్కించుకున్నాయి. ఇందులో టీడీపీది ఎక్కువ శాతం వాటా.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు కలిసి వెళ్లడంతోనే భారీ విజయాన్ని నమోదు చేసినట్లు కూటమి నేతలు చెబుతున్నారు.
పార్టీలను పక్కన పెడితే ఒక చేనేత పరిశ్రమకు చెందిన చేనేత కళాకారుల 75 లక్షల ఓట్లలో
ఇది పూర్తి అసత్యం. 11 లక్షల ఓట్లను వైయస్సార్సీ పార్టీకి వేసి ఉంటే మూడు పార్టీలు కూడా ఘోరంగా ఓడిపోయి ఉండేదని నేను విశ్లేషించి చెప్పుతున్నాను. ఇది సత్యం.
ఇంతకుముందు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు, పరిశ్రమను నిర్లక్ష్యం చేయడమే కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న పవర్ మగ్గాల యాజమాన్యాలకు సహాయ సహకారాలు అందించి, చేనేత పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం వల్లేనని మీరు గ్రహించలేకపోయారు.
చేనేత కళామతల్లికి ద్రోహం చేసిన ఏ ప్రభుత్వ అధినేత అయిన మూల్యము చెల్లించుకోక తప్పదు. ఆకలి చావులకు ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రభుత్వాలు చేనేత కార్మికులు ఓట్లు వేసే యంత్రాలు గా చూడడం భావ్యము కాదు. నేత పరిశ్రమకు అన్యాయం చేయకండి. ఎప్పటికైనా చేనేత కళాకారులందరూ ఏకమై తిరగబడితే ? ఆలోచించండి.
అభివాదములతో,

ఏవి రమణ. రిటైర్డు డీఎంవో అప్కో,
ప్రెసిడెంట్,
నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్.



Tags:    

Similar News