నక్సలైటు నుంచి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరకు

వామపక్ష భావజాలానికి ఆకర్షితులై నక్సలైటుగా మొదలైన మిథున్‌ చక్రవర్తి ప్రయాణం బీజేపీ వైపుగా సాగింది. బెంగాలీ సినిమాతో మొదలైన సినీ ప్రస్థానం బాలీవుడ్‌కు చేరింది.

Update: 2024-09-30 07:43 GMT


’ఐ యామ్‌ ఏ డిస్కో డ్యాన్సర్‌’ 90వ దశకంలో యావత్‌ భారత దేశాన్ని ఉర్రూతలు ఊగించిన పాట. తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ, హిందీ, గుజరాతీ, బెంగాలీ అనే తేడా లేకుండా భారత దేశంలోనే కాకుండా ఇండియన్‌ సినిమాని, ఇండియన్‌ మ్యూజిక్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన పాట. ఎక్కడ చూసిన ఈ పాట మారుమోగి పోయింది. యువతే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను, సంగీత ప్రయులను మంత్రముగ్దులను చేసింది. మిథున్‌ చక్రవర్తి హీరోగా, మ్యూజిక్‌ డైరెక్షన్‌ బప్పిలహరి కాంబినేషన్లో వచ్చిన ఈ సాంగ్‌ భారతీయుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ మైకంలో నుంచి తేరుకోక ముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో అద్బుతమైన పాటొచ్చింది. అదే ‘సూపర్‌ డ్యాన్సర్‌’ సాంగ్‌. ఈ పాటలు ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేశాయి. నాటి తరం వారే కాదు ఈ తరం వారు కూడా ఆ పాటలకు ఫిదా అవ్వాల్సిందే.

డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్‌ డ్యాన్స్‌ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి ఎన్నో పాటల ద్వారా భారతీయ ప్రేక్షకుల మనసులను దోచుకున్న మిథున్‌ చక్రవర్తికి దేశంలోని అత్యుత్తమ పురస్కారమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ప్రతి ఏటా ఇచ్చే ఈ పురస్కారం ఇస్తుంటారు. ఈ ఏడాదికి గాను మిథున్‌ చక్రవర్తికి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు. అక్టోబర్‌ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్‌ చక్రవర్తిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు. మిథున్‌ చక్రవర్తిని ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ అవార్డు కూడా వరించింది.
1979లో వచ్చిన సురక్షా సినిమా ద్వారా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న మిథున్‌ చక్రవర్తి ’డిస్కో డాన్సర్‌’, ’డ్యాన్స్‌ డ్యాన్స్‌’, ’ప్యార్‌ ఝుక్తా నహీ’, ’కసమ్‌ పైదా కర్నే వాలేకి’, ’కమాండో’ ఎన్నో సినిమాల ద్వారా బంపర్‌ హిట్‌ సాధించిన మిథున్‌ చక్రవర్తి సినీ ప్రస్థానం ‘మృగయా’తో మొదలైంది. దానికంటే ముందు ఆయన వామపక్ష భావజాలానికి ఆకర్షితులై నక్సలైట్‌గా మారారని చెబుతారు. ఎంతో ఉత్సాహంతో ఆ పోరాటాల్లో పాల్గొనే వారని, ఆయనలో ఉన్న చరిష్మాను, తెగువను గుర్తించిన ప్రముఖ దర్శకుడు మృణాల్‌సేన్‌ సినీరంగ వైపుగా మళ్లించారు. తాను దర్శకత్వం వహించిన మృగయా సినిమాతో మిథున్‌ చక్రవర్తి తెరంగేట్రం చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇక అక్కడ నుంచి మిథున్‌ చక్రవర్తి తిరిగి చూడ లేదు.
బెంగాలీ చిత్రంతో ప్రారంభమైన మిథున్‌ చక్రవర్తి సినిమా ప్రస్థానం బాలివుడ్‌కు చేరింది. ఇక అక్కడ తిరుగులేని నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. బెంగాలి వాసి అయిన మిథున్‌ చక్రవర్తి నాడు వామపక్ష భావజాలనికి ఆకర్షితులయ్యారు. ఉత్తరాదికి చేరుకున్న తర్వాత ఆయన క్రమేపి తన ఐడియాలజీని మార్చుకున్నారు. బీజేపీలో చేరారు. అక్కడ రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం వెనుక మిథున్‌ చక్రవర్తికి బీజేపీతో ఉన్న అనుబంధం కూడా ఒక కారణమనే టాక్‌ వినిపిస్తోంది.


Tags:    

Similar News