వైసీపీ నేత పిన్నెల్లి అరెస్ట్..

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

Update: 2024-06-26 10:47 GMT

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆయనను కోర్టుకు తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసుల వర్గాలు చెప్పాయి. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పల్నాడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో ఆయనపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.

వీటిలోని మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ తీసుకుని ఆయన బయట తిరుగుతన్నారు. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.తనపై నమోదు చేసిన నాలుగు కేసుల్లో ముందుస్తు బెయిల్ కోసం పిన్నెల్లి.. హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో పిన్నెల్లి తరపున నంబూరి శేషగిరి రావు, పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిల్‌గా ఎన్ అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఆయన ముందుస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తుందని న్యాయస్థం వెల్లడించింది. ఆయన దాఖలు చేసిన అన్ని బెయిల్ పిటిషన్లు రద్దు కావడంతో వెంటనే స్పందించిన పల్నాడు పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. కుదిరితే ఈరోజే ఆయనను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News