మాజీ మంత్రి విడదల రజనీకి ఏసీబీ షాక్, ఆమె మరిది అరెస్ట్

వైసీపీ మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమెకి మరో షాక్ తగిలింది.;

Update: 2025-04-24 03:25 GMT
vidadala Rajani
వైసీపీ మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమెకి మరో షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని పోలీసులు గురువారం (ఏప్రిల్ 23న) హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గోపీని ఏపీకి తరలిస్తున్నారు.

పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విడదల రజనీతో పాటు ఆమె మరిది కూడా నిందితునిగా ఉన్నారు. విజిలెన్స్‌ సోదాల పేరుతో స్టోన్‌క్రషర్‌ యాజమానిని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలపై ఇప్పటికే మాజీ మంత్రి రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న విడదల రజనీ విదేశాలకు పారిపోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆమెను విశాఖపట్నం ఎయిర్ పోర్టులో నిర్బంధించినట్టు సమాచారం.
ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గోపీని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌.. వైఎస్సార్‌సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారని ఆ పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
Tags:    

Similar News