చిన్నారి మాటలకు ఏడ్చేసిన మాజీమంత్రి హరీష్ రావు
రాజకీయాల్లో 24 గంటలూ బిజీగా ఉంటు ప్రత్యర్ధులపైన ఆరోపణలు, విమర్శలతొ విరుచుకుపడే బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు చిన్నారి మాటలకు కంటతడిపెట్టారు;
రాజకీయాల్లో 24 గంటలూ బిజీగా ఉంటు ప్రత్యర్ధులపైన ఆరోపణలు, విమర్శలతొ విరుచుకుపడే బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు చిన్నారి మాటలకు కంటతడిపెట్టారు. విషయం ఏమిటంటే ‘లీడ్ ఇండియా ఫౌండేషన్’ (Lead India Foundation)ఆధ్వర్యంలో శనివారం సిద్ధిపేట పట్టణంలో కార్యక్రమం జరిగింది. ‘భద్రంగా ఉండాలి..భవిష్యత్తులో ఎదగాలి’ అనే అంశంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. తన నియోజకవర్గమే కాబట్టి ఎంఎల్ఏ హోదాలో హరీష్(BRS MLA) హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేకమంది పిల్లలు మాట్లాడి తాము భవిష్యత్తులో ఏమవుదామని అనుకుంటున్నారో వివరించారు. అలాంటి పిల్లల్లో సాత్విక అనే చిన్నారి కూడా ఉంది.
సాత్విక ముందు తనను తాను పరిచయంచేసుకుని హరీష్(MLA Harish Rao) కు నమస్కరించింది. తర్వాత తనింటి పరిస్ధితిని వివరించింది. ‘తాను 2వ తరగతి చదువుతున్నపుడే తండ్రి చనిపోయాడని, తల్లే తనను కష్టపడి చదివిస్తోందని చెప్పింది. తన మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటానని..మా మమ్మీకి మంచిపేరు తీసుకొస్తానని..మా మమ్మీ, డాడీ పేర్లకు వాల్యూ తెచ్చేలా నడుకుంటాన’ని ఏడుస్తు చెప్పింది. ‘తాను పెద్దయ్యాక తన మమ్మీని మంచిగా చూసుకుంటాన’ని భోరున ఏడుస్తునే చెప్పింది. ఏడుపుతో బొంగురుపోయిన, పూడుకుపోయిన చిన్నారి గొంతువిన్న హరీష్ కూడా ఏడ్చేశారు. ఏడుస్తునే చిన్నారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.