ఆంధ్రలో ఫ్లడ్ ఫ్లెయిన్స్ పరిరక్షణ చట్టం తేవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఫ్లడ్ ఫ్లెయిన్స్ పరిరక్షణ చట్టం తేవాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఫ్లడ్ ఫ్లయిన్స్ అంటే ఏమిటి? ఎందుకు లేఖ రాశారు? తెలుసుకుందాం.

Update: 2024-07-29 13:12 GMT

ఫ్లడ్ ప్లెయిన్స్ పరిరక్షణ చట్టం  ఆంధ్రప్రదేశ్ లో తీసుకొని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు  మాజీ  ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సోమవారం లేఖ రాశారు. ఏపీలో వరదల సమయంలో వరద నీటి ద్వారా అతి సారవంతమైన సిల్ట్ చేరుతుంది. సిల్ట్ పేరుకొని పోయిన ప్రాంతాన్ని ప్లెయిన్స్ అంటారు. దీనిని ఎంతో జాగ్రత్తతో ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఫ్లడ్ ఫ్లెయిన్స్ పై సీఎంకు శర్మ రాసిన లేఖ సారాంశం ఇలా ఉంది.

ముఖ్యమంత్రిగారూ,

మన రాష్ట్రంలో కృష్ణ, గోదావరి వంటి నదుల తీరప్రాంతాలలో, ఏటా వరదనీటి ద్వారా అతిసారవంతమైన సిల్ట్ చేరుతున్నది. అటువంటి సిల్ట్ డిపాజిట్ అయిన ప్రాంతాన్ని అంటే ఫ్లడ్ ప్లెయిన్స్ (floodplains) ను అతి జాగ్రత్తతో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఫ్లడ్ ప్లెయిన్స్ లో వర్షం నీరు, వరద నీరు చేరడం వలన, అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తాయి. అటువంటి జలవనరులను సరి అయిన విధంగా పరిరక్షిస్తే, ఆ ప్రాంతంలో సాగునీరు, ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కాని కాలుష్యం కలిగించని వ్యవసాయ విధానాలు, అంటే ప్రకృతి వ్యవసాయ విధానాలు మాత్రమే పాటించాలి. 

ఆ కారణంగా ఇతర దేశాల్లో, ఫ్లడ్ ప్లెయిన్స్ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు అమలులో ఉన్నాయి. ఉదాహరణకు.. అమెరికా లో మిసిసిపి నది తీరంలో floodplains ను పరిరక్షించడం కోసం, మిసిసిపి రివర్ కన్సర్వేషన్ (River Conservation Act) అమలులో ఉంది . కెనడా దేశంలో కూడా అటువంటి River Conservation Act అమలులో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రివర్ కన్సర్వేషన్ యాక్ట్ (AP River Conservancy Act, 1884) ఆధారంగా నదుల పరిరక్షణ చేయవలసి ఉంది. కాని ఆ చట్టం క్రింద ఫ్లడ్ ప్లెయిన్స్ పరిరక్షణ సాధ్యం కాదు. ప్రత్యేకంగా, ఫ్లడ్ ప్లెయిన్స్ ల పరిరక్షణ కోసం, ఒక చట్టాన్ని ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఒక నమూనా చట్టాన్ని తయారుచేసి, రాష్ట్రాలలో అటువంటి చట్టాన్ని అమలు చేయాలని, కొన్ని సంవత్సరాలుగా పదే పదే విజ్ఞప్తి చేసినా, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ ప్రభుత్వాలు మాత్రమే, అటువంటి చట్టాలను అమలు చేశాయి. 

కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, ప్రత్యేకంగా గంగా నది కి చెందిన ఫ్లడ్ ప్లెయిన్స్ లను పరిరక్షించడానికి గంగా ప్లాన్ (River Ganga (Rejuvenation, Protection and Management) Authorities Order) ను 2016 లో తీసుకువచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు వరకు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తయారుచేసిన ఫ్లడ్ ప్లెయిన్స్ జోనింగ్ చట్టాన్ని అమలు చేయకపోవడం కారణంగా, నదీ తీర ప్రాంతాల్లో ఫ్లడ్ ప్లెయిన్స్ కు నష్టం కలుగుతున్నది. భవన నిర్మాణానికి కావాల్సిన ఇసుక తవ్వడం, ఫ్లడ్ ప్లెయిన్స్ జోనింగ్ కు అనుగుణంగా లేకపోతే నదుల ఫ్లడ్ ప్లెయిన్స్ కు ఇంకా నష్టం కలిగే అవకాశం ఉంది. 

ఫ్లడ్ ప్లెయిన్స్ జోనింగ్ చట్టం అమలు లోనికి వస్తే, నదుల ఫ్లడ్ ప్లెయిన్స్ ను మ్యాపింగ్ చేసి, ఆ ప్రాంతాల్లో నిబంధనలను చట్టపరంగా అమలు చేయవచ్చు. ముఖ్యంగా, కొత్త రాజధాని అమరావతి అభివృద్ధి సందర్భంగా కావాల్సిన ఇసుక తవ్వకాల కారణంగా, కృష్ణా నది, ఉపనదులు ఫ్లడ్ ప్లెయిన్స్ కు నష్టం కలగకుండా ఉండాలంటే, ఫ్లడ్ ప్లెయిన్స్ జోనింగ్ చట్టాన్ని, ప్రభుత్వం ప్రవేశ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

జాతీయ హరిత ట్రిబ్యునల్ [National Green Tribunal (NGT)] వారు, అమరావతికి చెందిన కేసు (No.935/2018) లో, 4-4-2019 న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఫ్లడ్ ప్లెయిన్స్ నాశనం చేయడం వల్ల భావితరాలకు ఎనలేని నష్టం జరుగుతుందని ( Future generation will have to pay heavy price for destruction of the flood plains of the rivers)  రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.

అమరావతి నిర్మాణ కార్యక్రమానికి, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ప్రకారం, ప్రపంచ బ్యాంకు వంటి వ్యవస్థల ద్వారా రావడం, అటువంటి వ్యవస్థలు పర్యావరణ పరిరక్షణ కు ఇచ్చే అత్యంత ప్రాధాన్యత, దృష్టిలో పెట్టుకుని, అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ, జలవనరుల పరిరక్షణ కు సంబంధించిన చట్టాలను, నిబంధనలను, ఎన్ జిటి ఉత్తర్వులను అనుసరించ వలసిన అవసరం ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా, నదుల floodplains లో ఉన్న భూగర్భ జలవనరుల పరిరక్షణ కోసం, ముఖ్యంగా కృష్ణా నది floodplains పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆలస్యం చేయకుండా, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సలహాలను పాటించి, Flood Plain Zoning చట్టాన్ని రాష్ట్ర శాసనసభ లో ప్రవేశపెట్టి, అమలు చేయాలని నా విజ్ఞప్తి. 

Tags:    

Similar News