సినీ నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్ను మూత
సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సమంత.
ప్రముఖ సినీ నటి సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్ను మూశారు. ఈ విషయాన్ని సమంతే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘నాన్నా.. మనం మళ్లీ కలిసేంత వరకూ’ అంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. దీంతో పాటుగా హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంత తండ్రి మరణించిన విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అయితే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఎందుకు చనిపోయారనేది తెలియాల్సి ఉంది. సమంతకు, తన తండ్రి జోసెఫ్ ప్రభు అంటే ఎంతో ప్రేమ. వారిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. వారి అనుబంధాన్ని సమంత టీవీలకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో కూడా వెల్లడించారు. సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సమంత అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సమంత మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.