ఆకుపచ్చ కండువాలతో ఆకట్టుకున్న రైతులు
అమరావతి రైతులు ఆకుపచ్చ కండువాలతో ప్రధాని సభకు వచ్చారు. మెడలో కండువాలు ధరించారు.;
By : The Federal
Update: 2025-05-02 10:30 GMT
అమరావతికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాల వారు ఆకు పచ్చ కండువాలతో దర్శనమిచ్చారు. ఈ కండువాలు వేసుకున్న రైతు మహిళలు, రైతులు ప్రత్యేక ఆకర్షణగా సభలో కనిపించారు. అమరావతి రైతులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు ప్రభుత్వం పంపించింది. దీంతో వారంతా ఆకుపచ్చ కండువాలతో దర్శనమివ్వడంతో ఇదేంటి కొత్తరంగని కొందరికి అనిపించింది. అయితే రైతులు, రైతు సంఘాల వారు ఆకుపచ్చ రంగును ఆహ్వానిస్తారు. ఆకు పచ్చ రంగు రైతుల గురించి తెలియజేస్తుంది. ప్రభుత్వం కూడా అమరావతి రైతులు ప్రత్యేకంగా కనిపించాలని వారిని ఆకు పచ్చ కండువాలు మెడలో వేసుకుని రావాల్సిందిగా సూచించారు. దీంతో మహిళా రైతులు ఎక్కువ మంది ఆకుపచ్చ కండువాలు ధరించి సభలో పాల్గొన్నారు. వీరు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.