రైతును రోడ్డున పడేశాడు చంద్రబాబు...

సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైంది. సలహా మండళ్లను రద్దు చేశారు. ఏ రంగం చూసినా తిరోగమనంలో నడుస్తోందన్న మాజీ సీఎం జగన్‌

Update: 2024-09-20 12:05 GMT

సీఎం చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు చేపట్టిన కార్యక్రమాలు, వాటి వల్ల రైతులకు చేకూరిన లబ్దిని పోల్చుతూ జగన్‌ మాట్లాడారు. శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో జగన్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. 100 రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఏమి చేశారో చెప్పాలన్నారు. రైతులను, వారి సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఇ్వలేదన్నారు. రైతులకు పెట్టబడి సాయం కింద రూ. 20వేలు ఇస్తామన్నారు. ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.

వ్యవసాయం మొదలయ్యే సమయానికి ఇవ్వాల్సిన సాయం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.తమ ప్రభుత్వ హయాంలో అన్నీ సకాలంలో అందిస్తూ వచ్చామన్నారు. దీంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులు వ్యవసాయం చేసుకున్నారని అన్నారు. తమ హయాంలో కొనసాగిన రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఎగ్గొట్టారన్నారు. ఒక పక్క రైతులకు ఇచ్చే పెట్టు సహాయం పోయింది. మరో వైపు రైతులకు ఉచిత పంటల బీమా కూడా ఎగిరిపోయిందన్నారు. రైతులకు, వారేసిన పంటలకు న్యాయం చేకూర్చే ఈ క్రాపింగ్‌ చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయ లేదన్నారు. సకాలంలో దీనిని ఎందుకు చేపట్ట లేదని ప్రశ్నించారు. రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను కూడా రద్దు చేశారన్నారు. ఇలా రాష్ట్రంలో ఏ రంగం చూసుకున్న తిరోగమనంలో నడుస్తోందని మండిపడ్డారు. మరో పక్క 100 రోజులు పూర్తైన దానిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పండుగలా చేస్తోందని, ఈ వంద రోజుల్లో రైతులకు ఏమి చేశారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి మేలు చేయకుండా ఎలా పండుగను చేసుకుంటారన్నారు.

Tags:    

Similar News