హిందూపురంలో మాటలు సృష్టించిన విధ్వంసం..
ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించిన జగన్
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-15 14:13 GMT
సినీ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యాలు ఉద్రిక్తతకు దారితీశాయి. వారి మాటలతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, బాలృష్ణ అభిమానులు రెచ్చిపోయారు. హిందూపురంలోని వైసీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. దీంతో హిందూపురం పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఈ సంఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.
ఈ సంఘటనపై వైసీపీ చీఫ్ వైయస్ జగన్ ఘాటుగా స్పందించారు.
"ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి"గా ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. మా పార్టీ కార్యాలయంలో మా వాళ్లు సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటే దాడి చేయడం ఏమిటని వైఎస్. జగన్ ప్రశ్నించారు.
హిందూపురంలో ఏం జరిగింది
హిందూపురం వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ దీపిక భర్త వేణు రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రెడ్బూక్ రాజ్యాంగం అమలు చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన ఆరోపించారు.
"హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ కె పరిమితం అవుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా". అని వైసిపి నేత వేణు రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
"40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం ఎవరికి ఇందో బానిసలుగా బతుకులు బతుకుతున్నాం. ఎవడో హైదరాబాదులో ఉంటే వాడి కింద మనం బతకాల" అని వేణు రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలతో టిడిపి శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయారు. మూకుమ్మడిగా వైసిపి కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దొరికిన వస్తువును దొరికినట్లు విధ్వంసం సృష్టించారు. వైసీపీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలపై కూడా కుర్చీలతో దాడి చేసిన ఘటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
"కార్యాలయంలోకి చొరబడిన టిడిపి మద్దతుదారులు దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇది దారుణ ఘటన" అని వైసిపి నాయకులు వీడియోలు విడుదల చేశారు.
మా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకుంటూ ఉంటే వైసిపి నాయకులు దాడి చేయడం అత్యంత దారుణమని ఆ పార్టీ ఇన్చార్జి దీపిక, ఆమె భర్త వేణురెడ్డి నిరసన వ్యక్తం చేశారు. వైసిపి అధికారంలో ఉండగా హిందూపురంలో ఇలాంటి దాడులు జరిగాయి అని కూడా వారు ప్రశ్నించారు. మా పార్టీ కార్యాలయంపై జిడిపి మద్దతు దారులు దాడి చేస్తున్నారనే సమాచారం అందించిన పోలీసులు నుంచి ఏమాత్రం స్పందన లేదని దీపిక ఆమె భర్త వేణు రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
"దాడి చేసి వెళ్లిపోయిన తర్వాత పోలీసులు నింపాదిగా వచ్చారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. జగన్ 2.0 లో పరిస్థితులు వేరుగా ఉంటాయి" అని వైసిపి ఇన్చార్జి దీపికాభర్త వేణు రెడ్డి ఘాటు హెచ్చరిక చేశారు.
ఈ ఘటనపై వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ స్పందించారు.
"మా పార్టీ కార్యాలయం పై టిడిపి నాయకులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు చేసిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యం పైన చేసిన ప్రత్యక్ష దాడిగానే ఉంది" అని జగన్ వ్యాఖ్యానించారు. ఇది అనాగరిక చర్య. పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం ఏ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా తన రాజకీయ అజెండా కోసం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని కూడా ఆయన నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు అని వైసిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. హిందూపురం వైసీపీ కార్యాలయం పై దాడికి పాల్పడిన వారు ఎవరనేది సిసిరి కెమెరాలు రికార్డు అయింది నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
"అధికారం ఉందని గర్వంతో రెచ్చపోతున్న టిడిపి నాయకులు కార్యకర్తలకు భవిష్యత్తులో తప్పకుండా గుణపాఠం చెబుతాం" అని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన అల్టిమేట్ జారీ చేసినట్లు మాట్లాడారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అనే వ్యవహరించడం వల్లే శాంతి భద్రతల సమస్యలు ఆయన కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరిక జారీ చేశారు.