కేరళ నుంచి ఈశాన్యం వరకు విస్తరించిన ద్రోణి..ఏపీలో నేడు భారీ వర్షాలు
మే 24 నాటికి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. కేరళను తాకడంతో పాటు ఈశాన్యప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయని అంచనా వేస్తున్నారు.;
By : The Federal
Update: 2025-05-21 05:05 GMT
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. రుతుపవనాల ప్రభావం వల్ల అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు రుతుపవనాల ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారంతో పాటు గురుకువారం కూడా ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లోని నంద్యాల జిల్లా, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాఉ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
2009 తర్వాత ఈ ఏడాదే సాధారణం కంటే ముందుగా రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. 2009లో సరిగ్గా మే 23న రుతుపవనాలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చి, కేరళను తాకాయి. అయితే ఈ ఏడాది కూడా ఇంచు మించు అదే సమయంలో రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి. మే 23న కానీ, ఒక రోజు తర్వాత మే 24న కానీ రుతుపవనాలు కేరళను తాకే అకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది మే 24న నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ప్రవేశిస్తే.. 2009 తర్వాత ముందుగా రుతుపవనాలు ప్రవేశించడం ఇదే తొలిసారి కానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ ప్రారంభం నాటికి నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాయి.
కానీ సాధారణం కంటే గతేడాది కూడా ముందుగానే ఇండియాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.. కేరళను తాకాయి. రెండు రోజుల ముందు అంటే మే 30న పోయిన ఏడాది రుతుపవనాలు కేరళను తాకాయి. అయితే అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగాళాఖాతం మీదుగా ఈశాన్య ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయి. ఇలా ఒకే సారి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం, అదే రోజు ఈశాన్య ప్రాంతాలకు విస్తరించడం కూడా చరిత్రలో చాలా అరుదైన సందర్భం. గతంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. 2017లో కూడా కేరళను తాకడం, ఈశాన్యప్రాంతాలకు విస్తరించడం జరిగింది.
ఇలాంటి సందర్భమే ఈ ఏడాది కూడా జరిగే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు మే 23 లేదా మే 24న ఇండియాలోకి ప్రవేశించి, కేరళను తాకనున్నాయని, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు దీనికి అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. అలా ప్రవేశించే నైరుతి రుతుపవనాలు మే 26 నాటికి రాయలసీమ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.