మాజీ స్పీకర్ తమ్మినేనికి జలక్!
మరికొద్ది రోజుల్లో బట్టబయలు కాబోతున్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం.
Byline : Vijayakumar Garika
Update: 2024-09-29 05:53 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త కేసు తెరపైకి వచ్చింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ సర్టిఫికేట్లను సృష్టించడంతో పాటు వాది ఆధారంగా పలు కళాశాలల్లో అడ్మిషన్లు పొందారని ఆమదాలవలస ఎమ్మెల్యే కూర రవికుమార్ తెరపైకి తెచ్చారు. ఈ వివరాలను, డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందజేశారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రధాన క్యాదర్శికి ఫిర్యాదు చేశారు.
ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఫోర్జ్›్డ, ఫ్యాబ్రికేటెడ్ నకలీ డిగ్రీ సర్టిఫికేట్‌ను తయారుచేసి, హైదరాబాదు, ఎల్బీనగర్ లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో మూడు సంవత్సరాల లా డిగ్రీ అడ్మిషన్ పొందారు. దీనిపైన గతంలో 2022 వ సంవత్సరం నుండి పోరాటం చేస్తున్నట్లు సీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు స్పీకర్‌గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం పైన చర్యలు తీసుకోవాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ జస్టిస్‌కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి, రాష్ట్రపతికి అన్ని నకిలీ సర్టిఫికెట్ల వివరాలన్నీ పొందుపరిచి ఫిర్యాదు చేశాను. కానీ ఏ స్థాయిలో వారు కూడా స్పందించలేదు.
అప్పటి రాష్ట్రపతికి నేను పెట్టినటువంటి ఫిర్యాదుకి విచారణ చేయమని రాష్ట్రపతి కార్యాలయం నుంచి నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ లెటర్ వచ్చింది. అయినా సరే గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి చీఫ్ సెక్రటరీ ఎటువంటి విచారణ జరిపించలేదు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన లేఖను జతపరుస్తూ తమ్మినేని సీతారాం తయారు చేసిన నకిలీ డిగ్రీ (ఫేక్, ఫోర్జ్›్డ– ఫ్యాబ్రికేటెడ్) డాక్యుమెంట్ డిగ్రీ సర్టిఫికేట్‌ను పొందుపరిచి, వాటితో పాటు ఇది ఫ్యాబ్రికేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్ అని చాలా స్పష్టంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వారు ఇచ్చినటువంటి లేఖలు, ఈ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్‌ను పెట్టి మహాత్మా గాంధీ లా కాలేజీలో మూడు సంవత్సరాల ఆయన అడ్మిషన్ పొందారని, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ వారు ఇచ్చినటువంటి అన్ని లేఖలను జతపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడితో ఈ నకిలీ సర్టిఫికెట్లు పైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అందజేసినట్లు ఆముదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ ఫిర్యాదులో తెలిపారు.