వెయ్యి మంది మహిళా డ్రైవర్లకు ఉపాధి..సంతోషంగా ఉంది

ఈవీ వాహనాల కొనుగోలు చేసేందుకు మహిళలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని మంత్రి లోకేష్‌ అన్నారు.;

Update: 2025-08-25 05:55 GMT

ర్యాపిడ్‌ భాగస్వామ్యంలో వెయ్యి మంది మహిళా డ్రైవర్లకు ఉపాధి కలగడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. మరో వైపు ‘స్త్రీ శక్తి’ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా చాలా పెద్ద విజయమని లోకేష్‌ పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన సోమవారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈవీ వాహనాల కొనుగోలు చేసుకునేందుకు మహిళలకు కూటమి ప్రభుత్వం రాయితీలు ఇస్తోందన్నారు.

ర్యాపిడో డ్రైవర్లుగా పని చేస్తోన్న మహిళలకు స్పూర్తినిచే మాటలు లోకేష్‌ చెప్పారు. రవాణ ప్రణాళిక(మొబిలిటీ) అంటే కేవలం ప్రయాణం కాదు.. ఇది ఓ గొప్ప అవకాశం.. ఓ గొప్ప గౌరవం అంటూ స్పూర్తని నింపే మాటలు చెప్పారు. అంతేకాకుండా తమ కూటమి ప్రభుత్వంపైన కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. ముమ్మాటికీ ఇది మంచి ప్రభుత్వమే అంటూ ట్వీటర్‌ వేదికగా లోకేష్‌ పేర్కొన్నారు. మహిళల ర్యాపిడో వాహనాల డ్రైవింగ్‌పై రూపొందించిన ఓ వీడియోను కూడా మంత్రి లోకేష్‌ తన ట్వీట్‌తో షేర్‌ చేశారు.


Tags:    

Similar News