విద్యుత్‌ చార్జీలు పెంచలేదు

జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే సమయం సరిపోతుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.;

Update: 2025-05-12 07:46 GMT

విద్యుత్‌ చార్జీల మీద ఆ శాఖ మంత్రి గొట్టిపారి రవికుమార్‌ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, రానున్న రోజుల్లో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. యాక్సిస్‌ గ్రూప్‌ ఫీల్డ్‌ ఎనర్జీ మీద వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. యాక్సిస్‌ ఎనర్జీకి రూ. 5.12లకు గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, అయితే కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వెనక్కు తీసుకుందని, రూ. 4.60లకు పీక్‌అవర్స్‌లో కూడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు.

జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ శాఖను కేవలం ఒక ఆదాయ వనరుగా మర్చుకుందని, జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికే తమ సమయం సరిపోతుందని గొట్టిపాటి రవి అన్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీకి ప్రకాశం, రాయలసీమ జిల్లాలు ఎంతో అనుకూలమని, అందువల్ల ఈ జిల్లాల్లో రెన్యూవబుల్‌ ఎనర్జీకి పెద్దపీట వేయడానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించందన్నారు. గత ఐదేళ్లల్లో తప్పులు చేసిన వారికి రెడ్‌బుక్‌ వర్తిస్తుందని గొట్టిపాటి స్పష్టం చేశారు.
Tags:    

Similar News