జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ–2025 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం మెగా డీఎస్సీ–2025 నోటిషికేషన్‌ విడుదల చేశారు.;

Update: 2025-04-20 06:12 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ తన సోషల్‌ మీడియా వేదికగా మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌ను, మెగా డీఎస్సీ–2025 షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. ఇది వరకు ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా కూటమి ప్రభుత్వం భర్తీ చేయనుంది. అయితే మెగా డీఎస్సీ–2025కు సంబంధించిన పూర్తి సమాచారం, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, డీఎస్సీ–2025 పరీక్షల వివరాలు, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ వివరాలు వంటి డిఎస్సీ–2025కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్‌లు

cse.ap.gov.in   లేదా https://apdsc.apcfss.in లో చూసుకోవచ్చని మంత్రి నారా లోకేష్‌ తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆల్‌ ద వెరీ బెస్ట్‌ అంటూ డీఎస్సీ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

షెడ్యూల్‌ వివరాలు
– ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణకు అవకావం ఉంటుంది.
– మే 30 నుంచి హాల్‌ టికెట్లు డైన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
– జూన్‌ 8 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ.
– పరీక్షలన్నీ పూర్తి అయిన తర్వాత రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల.
– ఆ తర్వాత వారం రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ.
– ఆ తర్వాత ఏడు రోజులకు ఫైనల్‌ ‘కీ’ విడుదల.
– అనంతరం వారం రోజులకు మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు.
Tags:    

Similar News