పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల సందేహాలకు తెరపడినట్లేనా?
రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సందేహాలతో ముందుకు సాగలేదు.;
ఎంతో మంది నిపుణుల అభిప్రాయాలు. ప్రపంచంలోని అత్యంత ఆధునిక ఇంజనీర్ల ప్రవేశం. ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపట్టాలో ఆలోచనలు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టు పనులు ప్రకృతి సహకారం లేక ఆగిపోయాయి. తిరిగి ప్రారంభించేందుకు తొమ్మది నెలల కాలం పట్టంది. ఇప్పటికీ ఇంకా మొదలు కాలేదు. అన్ని సందేహాలకు తెరపడినట్లేనని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇకపై వేగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల నుంచి వేల కోట్లు మట్టిలో పోసిన పాలకులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తిరిగి బేస్ మెట్ నుంచి బండ్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. బండ్ నిర్మాణం చేపట్టాలంటే ఎదురయ్యే అడ్డంకులన్నీ నేటికి పూర్తయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి లీకేజీ కారణంగా పనులు ముందుకు సాగలేదు. బండ్ నిర్మణం ప్రాంతంలో కొంత భాగం బంకమన్ను ఉన్నందున దానిపై ఎలా నిర్మాణం చేపట్టాలి. ఆ మట్టి గట్టితనం ఎంత అనే అంశాలపై కూడా అధ్యయనాలు జరిగాయి. అవన్నీ క్లియర్ అయినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరింగ్ నరసింహమూర్తి తెలిపారు.
బట్రెస్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
కాపర్ డ్యామ్ పై భాగంలో నది నీరు కిందకు రాకుండా నిర్మించే బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. బట్రస్ డ్యామ్ పొడవు 2,458 మీటర్లు ఉంది. పనులు వెంటనే చేపట్టవచ్చని పోలవరం ప్రాజెక్టు ఏపీ ఇంజనీర్లకు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఓరల్ ఆదేశాలు ఇచ్చారు. బట్రెస్ డ్యామ్ అనేది కాపర్ డ్యామ్ కు సమాంతరంగా పై భాగంలో నిర్మిస్తారు. దానిని దాటిన తరువాత సీపేజీ వాటర్ కాపర్ డ్యామ్ ను దాటాల్సి ఉంటుంది. ఈ లోపు ఆ వాటర్ ను ఇంజన్ల ద్వారా కిందకు రాకుండా తోడివేత చేపడతారు. అందువల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు.
కాపర్ డ్యామ్ లు స్ట్రాంగ్ గానే ఉన్నాయి
ప్రస్తుతం ఆనకట్టకు పై భాగాన, కింది భాగాన నిర్మించిన కాపర్ డ్యామ్ లు బలంగానే ఉన్నట్లు ఇంజనీర్లు ధృవ పరిచారు. అందువల్ల ఇబ్బందులు తొలగినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉన్నందున సోమవారం (మార్చి 3వ తేదీ) విదేశీ నిపుణులతో ఇంజనీర్లు చర్చించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో బంకమన్ను ఉన్న 500 మీటర్ల మేర ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. బంకమన్ను ఉన్న ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి 25 మీటర్ల మేర అక్కడ గట్టితనాన్ని మెరుగు పరచాల్సి ఉందని నిపుణులు సూచించారు. ఆ పనులు జరుగుతున్నాయి. ఆనకట్టకు ఆనకట్ట వద్ద సీపేజీ వాటర్ ను నిరోధించేందుకు వాల్స్ నిర్మిస్తున్నారు. ఇవి కూడా వెంటనే మొదలు పెడతారు.
565 మీటర్లలో గ్యాప్-1 ప్రధాన డ్యామ్
ప్రధాన డ్యామ్ గ్యాప్-1 పనులు వెంటనే మొదలు పెట్టవచ్చునని విదేశీ ఇంజనీర్లు చెప్పారు. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రతిపాదనల ఆకృతులకు ఆమోదం లభించాల్సి ఉంది. అది నామమాత్రమేనని, జలవనరుల శాఖ వెంటనే చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. బంకమన్ను ఉన్న ప్రాంతాల్లో స్టోన్ కాలమ్స్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విదేశీ ఇంజనీర్ల అభిప్రాయం ప్రకారం స్టోన్ అవసరం లేకుండానే పనులు సాగించవచ్చు.
వరదలు వచ్చే లోపు డయాఫ్రం వాల్ పూర్తి అవుతుందా?
డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు వేసవి నాలుగు నెలల కాలంలో పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే జరిగితే వరదలను అధిగమించిన వారవుతారు. వరదలు వచ్చినా కాపర్, బట్రెస్ డ్యామ్ ల వల్ల సీపేజీ నీరు వచ్చే అవకాశం లేదు. అలాగే డీ వాల్స్ కూడా సీపేజీ వాటర్ ను ఆపివేస్తాయి.
ప్రభుత్వం బడ్జెట్లో నిధులు నామినల్ గా కేటాయించిందనే విమర్శలు ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు రాబట్టు కుంటే తప్ప పనులు వేంగంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. రాష్ట్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,756.82 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.