మైక్‌ ఇవ్వరు.. సమయం ఇవ్వరు.. అసెంబ్లీకెళ్లి ఏం లాభం: మాజీ సీఎం జగన్‌

మీడియా ముందే సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తా. సమావేశాల సమయలో మీడియా ముందుకొచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడుతామని జగన్‌ అన్నారు.

By :  Admin
Update: 2024-11-07 12:47 GMT

అసెంబ్లీ సమావేశాల్లో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారో లేదో తెలియదు.. ప్రజల సమస్యలపై గొంతెత్తేందుకు మైక్‌ ఇస్తారో తెలియదు అందుకే మీడియానే తనకు స్పీకర్లని, మీడియా ముందే సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మైక్‌ ఇస్తే ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును ప్రజల సమస్యలపై ఎండగడుతామని భయపడుతోందని విమర్శించారు. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీని, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించరని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో చెప్ననీకుండా ఉండేందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడికి, ఆ పార్టీ సభ్యులకు మాట్లాడేందుకు సమయం, మైక్‌ ఇస్తే ప్రజల సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. మైక్‌లు ఇవ్వరు. మాట్లేందుకు సమయం ఇవ్వరని విమర్శించారు. అలా మైక్‌లు ఇవ్వనప్పడు అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. అందువల్లే మీడియా ప్రతినిధులే తమకు స్పీకర్లని, పాలన తీరులోని వైఫల్యాలను మీడియా ముందు లేవనెత్తుతామన్నారు. అసెంబ్లీ సమావేశాల సయమంలో మీడియా ముందుకొస్తామని, మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Tags:    

Similar News