ఆ సినిమా చూసి ఆ విద్యార్థులు ఏమి చేశారో తెలుసా...

తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు లక్కీ భాస్కర్ సినిమా చూసి దానికి ప్రభావితులై హాస్టల్ వదిలి వెళ్లారు. ఎందుకు వీరు హాస్టల్ వదిలి వెళ్లారు?;

Update: 2024-12-12 13:09 GMT

సినిమాలు చూడటం, సినిమా హీరోలపై అభిమానం పెంచుకోవడం, అభిమాన సంఘాలు పెట్టడం, అభిమానుల సినిమాలు రిలీజ్ అయినప్పుడు సొంత డబ్బులు ఖర్చుపెట్టి హడావుడి చేయడం ఇప్పటి వరకు చూస్తున్నాం. అయితే ఏకంగా నలుగురు విద్యార్థులు డబ్బు సంపాదించేందుకు హాస్టల్ వదిలి వెళ్లారు. విశాఖపట్నంలోని ఆంథోని బోర్డింగ్ హోం నుంచి నలుగురు విద్యార్థులు లక్కీ భాస్కర్ సినిమా చూశారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ డబ్బులు భాస్కర్ ఎలా సంపాదించారో చూశారు. ఆరోజు తమ స్నేహితులతో మాట్లాడుతూ ఎన్ని రోజులు ఇలా ఉంటే ఏమి లాభంరా... లక్కీ భాస్కర్ చూడు ఉన్నట్లుండి ఎంత డబ్బు సంపాదించాడో.. కార్లు కొన్నాడు. బంగారం కొన్నాడు. ఏ ది కావాలంటే అది కొన్నాడు అలా బతకాలిరా.. అని మాట్లాడుకున్నారు.

ఇప్పటి వరకు బయట ప్రపంచాన్ని మనం చూడలేదు. ఎప్పుడూ ఈ హాస్టల్, స్కూలే సరిపోతుందని భావించిన నలుగురు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోయి డబ్బు సంపాదించాలనుకున్నారు. గత ఆదివారం విశాఖలోని పాత పోస్టాఫీస్ సెంటర్ లో కొండపై ఉన్న గుడిలో జరిగే జాతరకు వెళ్లారు. టీచర్లతో కలిసి అక్కడి నుంచి విద్యార్థులు ఆర్కే బీచ్ కు వెళ్లారు. సరదాగా గడిపారు. తిరిగి ఆ రోజు సాయంత్రం హాస్టల్ కు వచ్చారు. సోమవారం ఉదయం నిద్రలేచి ఆరున్నర గంటల ప్రాంతంలో 15 అడుగుల ఎత్తులో ఉన్న హాస్టల్ గోడ ఎక్కి బయటకు దూకారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో రైల్వే స్టేషన్ కు చేరారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు.

Delete Edit

ఉదయం లేవగానే హాస్టల్ వార్డెన్ విద్యార్థులు జి రఘు, బి చరణ్ తేజ, ఎన్ కిరణ్ కుమార్, పి కార్తీక్ లు లేరని గమనించి వెంటనే తల్లిదండ్రుడకు సమాచారం అందించారు. అక్కడికి కూడా వారు చేరలేదు. హైదరాబాద్ లో ఎవరో బంధువులు వున్నారంటే అక్కడ కూడా విచారించారు. అక్కడికి వెళ్లలేదు. దీంతో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసి కెమెరాలు పరిశీలించారు. నలుగురు విద్యార్థులు గోడదూకి వెళుతున్న దృశ్యం కనిపించింది. వీరు హాస్టల్ నుంచి పారిపోయారని కన్ ఫాం చేసుకున్న తరువాత వారి ఫొటోలను పోస్టర్లు వేయించి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రదేశాల్లో అంటించారు. ఈ పిల్లలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఒప్తి చేశారు. దీంతో పోలీసులు ప్రధాన నగరాల్లో నిఘా పెట్టారు.

విజయవాడలోని మొగల్ రాజపురం ఏరియాలో నలుగురు పిల్లలు బ్యాగులు తగిలించుకుని పగలు పూట తిరుగుతూ సోమవారం ఉదయం కనిపించారు. అనుమానం వచ్చిన పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు. మీరెవరని ప్రశ్నిస్తే విషయం తెలిసింది. ఎందుకు ఇలా వచ్చారని పోలీసులు అడిగితే డబ్బు సంపాదిందచేందుకు వచ్చామని చెప్పారు. ఎలా సంపాదించాలనుకున్నారని అడిగితే లక్కీ భాస్కర్ సినిమా చూశాము. ఎలాగైనా డబ్బు సంపాదించాలని వచ్చాము. ఇప్పటికీ డబ్బు సంపాదిస్తామనే నమ్మకం మాకుంది. మేము ఎవరమో ఎవరికీ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

వీరిని అపుపులుకి తీసుకున్న పోలీసులు విశాఖ పోలీసులకు సమాచారం అందించారు. నలుగురు పిల్లలు మా వద్ద ఉన్నారని, వారిని తీసుకుపోవాలని చెప్పడంతో కథ సుఖాంతమైంది. సినిమాలు యువతరం పైన, ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న విద్యార్థులపైన ఎంతటి ప్రభావం చూపుతున్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమాలు అంటే ఒకప్పుడు సందేశాత్మకంగా ఉండేవి. అందరినీ మోటివేట్ చుసేవిగా ఉండేవి. అవినీతి, అక్రమాలను ఎండగట్టేవిగా ఉండేవి. కానీ ఇప్పుడు అక్రమ మార్గంలో డబ్బును సులభంగా ఎలా సంపాదించవచ్చో కూడా సినిమాలు తీసి యువతను ప్రేరేపితులను చేస్తుండటం పట్ల సినీ అభిమానులు, సినీ రంగంపై అవగాహన ఉన్న వారు పెదవి విరుస్తున్నారు. ఈ రకం సినిమాలు భవిష్యత్ లో యువతరాన్ని ఎటువైపు నడిపిస్తాయో వేచి చూడాలస్సిందే.

Tags:    

Similar News