కృష్ణాకు వరద ముప్పు...ఈతకు వెళ్లొద్దు

వరద ప్రవాహం ఎక్కువుగ ఉంటున్న నేపథ్యంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.;

Update: 2025-07-30 06:37 GMT

కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. దీని ప్రభావం వల్ల విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద 3లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటి ప్రవాహం చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అందువల్ల కృష్ణా నదీపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ బుధవారం తెలిపారు. నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న సందర్భంలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. అందువల్ల కృష్ణా నదిలో ఎవరూ ప్రయాణించొద్దని, అలా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా అధికంగా ఉండే వరద నీటి ప్రవాహంలో ఈతకు వెళ్లడం కానీ, చేపలు పట్టేందుకు వేటకు వెళ్లడం కానీ చేయొద్దని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పశువులు, జంతువులను నదిలో వదిలేయం వంటివి చేయరాదని సూచించారు.

Tags:    

Similar News