పరిశ్రమలకు భూ కేటాయింపులపై చర్చ

పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.;

Update: 2025-07-17 15:14 GMT

ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, గొట్టిపాటి రవి కుమార్‌ , అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ , ఇంధన, పర్యాటక రంగాల్లోని వివిధ పరిశ్రమలకు భూములు కేటాయించే అంశాలతో పాటు వాటికి అనుమతులు మంజూరుపైన ఈ సమావేశంలో చర్చించారు. పెట్టుబడులు రాబట్టకోవడం, పరిశ్రమలు పెట్టేవారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు.

Tags:    

Similar News