తల్లిని, చెల్లిని రోడ్డుకు లాగింది జగన్‌ కాదా?: సీఎం చంద్రబాబు

జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం కాదని సీఎం చంద్రబాబు అన్నారు.

By :  Admin
Update: 2024-10-24 13:39 GMT

ఆస్తిలో వాటా ఇవ్వనంటూ సొంత తల్లిని, చెల్లిని జగన్‌ రోడ్డుపైకి లాగారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే విమర్శించకూడదనే షరతు జగన్‌ పెట్టారని అన్నారు. ఇలాంటి వ్యక్తులతో రాజకీయాలు చేయాలంటే సిగ్గనిపిస్తోందని, ఇవన్నీ చిల్లర రాజకీయాలని, ఇలాంటి రాజకీయాల్లో ఉండటం సిగ్గు చేటన్నారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవలైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని జగన్‌పై నిప్పులు చెరిగారు.

గురువారం ఆయన అమరావతి సచివాలయంలో మాట్లాడుతూ జగన్‌ తీరుపైన, వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు. విలువల్లేని రాజకీయాలు చేసి అందులో హీరోయిజం సంపాదించాలనుకోవడం చాలా దౌర్భాగ్యమని అన్నారు. ఏది చెప్పిన నమ్ముతారని అనుకుటుంన్నారని, చెత్త టీవీ, చెత్త పేపర్‌లో రాసేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారని జగన్‌ మీద మండిపడ్డారు. ఎన్ని చేసినా ప్రజలను నమ్మించలేరని జగన్ పై విమర్శలు గుప్పించారు. 
రాజధాని నిర్మాణం, అమరాతికి కొత్త రైల్వే లైన్‌ తదితర అంశాలపై సీఎం మాట్లాడారు. రూ. 45,300 కోట్లతో నాలు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం జరుగనుందని సీఎం చెప్పారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్‌ దశలో ఉన్నాయని అన్నారు. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని, 75 ప్రాజెక్టులు భూ సేకరణ సమస్యలు ఉన్నాయని, 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్‌ సమస్య పరిష్కారం అయ్యిందని, వచ్చే నెలలో ప్రాధాని మోదీ వచ్చి రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. అమరావతి రైల్వే ప్రాజెక్టును నాలుగేళ్లు కాకుండా మూడేళ్లల్లోనే పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరుతున్నట్లు చెప్పారు.
Tags:    

Similar News