ప్లాన్‌ ప్రకారమే పట్టాభితో చెప్పించ్చారా?

సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ మాట్లాడేందుకు సాహసించ లేదు. బట్ పట్టాభి చేత ఎందుకు మాట్లాడించినట్టు ?

Update: 2024-10-03 11:40 GMT

తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై దేశంలోనే అత్యున్నత న్యాయం స్థానం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. వేరే కేసు విచారణలో బిజీగా ఉన్న సుప్రీం కోర్టు గురువారం జరగాల్సిన విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇలా విచారణ దశలో ఉన్న లడ్డూ వివాదంపై తాజాగా టీడీపీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ గురువారం మధ్యాహ్నం మాట్లాడారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరి ఈ వివాదం గురించి మాట్లాడారు. నెయ్యి కొనుకోలుకు సంబంధించిన కాంట్రాక్టు వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా లైన్‌ బై లైన్‌ వివరించారు.

ఏఆర్‌ ఫుడ్స్‌ కంపెనీకి నెలకు వెయ్యి టన్నుల నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేదన్నారు. ఏఆర్‌ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి కేవలం 16 టన్నులు మాత్రమే అన్న విషయాన్ని టీటీడీ టెక్నికల్‌ కమిటీ నిర్థారించిందన్నారు. ఇలాంటి తక్కువ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఏఆర్‌ కంపెనీ నెలకు వెయ్యి టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేస్తుందని, దీనికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏఆర్‌ సంస్థ నుంచి బయలు దేరిన నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి చేరుకోవడానికి రోజుల తరబడి ఎందుకు సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. దారి మధ్యలో దానిని ఎక్కడికో దారి మళ్లించి కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఏఆర్‌ సంస్థను కేవలం బిల్లుల కోసమే అడ్డం పెట్టుకొని తతంగా నడిపించారని ఆరోపించారు. టీటీడీ లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యిలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దోపిడీ చేసేందుకే ఏఆర్‌ సంస్థను అడ్డం పెట్టుకున్నారని, దీనికి ఈ ఆధారాలే నిరూపిస్తున్నాయని ఆరోపించారు. రూ. 39 కోట్ల నెయ్యి కాంట్రాక్టులో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాపాలు చేశారని, దీనికి టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో పాటుగా టీడీపీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో లడ్డూ వివాదం కేసువిచారణ దశలో ఉండగా సీఎం చంద్రబాబు ఇలా చెప్పించడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన సోమవారం సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాటి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కానీ, మంత్రి లోకేష్‌ కానీ, ఇతర ప్రభుత్వ పెద్దలు కానీ, టీడీపీ నేతలు కానీ ఈ వివాదంపై నోరు మెదప లేదు. కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండటంతో ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఏ మీటింగ్‌లోను, ప్రెస్‌ మీట్లు పెట్టి ప్రస్తావించ లేదు. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కానీ, ఆయాన పార్టీ నేతలు కూడా ఎక్కడా దీని గురించి ప్రస్తావించ లేదు. అంతేకాకుండా సిట్‌ విచారణను నిలిపి వేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.
అయితే తాజాగా టీడీపీ నేత పట్టాభి దీనిపై స్పందడంలో మతలబేంటని చర్చ సాగుతోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో సుప్రీం కోర్టు దీనిపై చేపట్టాల్సి ఉంది. సరిగ్గా ఇదే సమయంలో టీడీపీ నేత పట్టాభి చేత ప్రెస్‌ మీట్‌ పెట్టించి మాట్లాడించడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. విచారణ సమయంలో దానిని డైవర్ట్‌ చేయడానికే కావాలనే టీడీపీ అధిష్టానం ఈ ఏర్పాట్లు చేసిందనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు గురువారం కూడా ఆ స్వరం పెంచుతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని, ఒక వేళ వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఇంత వరకు చేసిన నానాయాగీ గుట్టంతా రట్టు అవుతుందని భావించిందేమో కానీ, తిరుమలలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరో సారి చెప్పి ప్రజల ఆలోచనలను డైవర్ట్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. అయితే సుప్రీం కోర్టు కేసును రేపటికి వాయిదా వేయడంతో ఈ ప్లాన్‌ బెడిసి కొట్టినటై్టందనే చర్చ సాగుతోంది.
Tags:    

Similar News