KTR|కేటీఆర్ కు రేవంత్ పెట్టిన కొత్తపేరు ఏంటో తెలుసా ?

ఇకనుండి కేటీఆర్ ను అందరు సైకోరామ్(Psycho Ram) అనే పిలవాలని పిలుపిచ్చారు.

Update: 2024-11-26 05:12 GMT

ప్రధాన ప్రతిపక్ష నేత కేటీఆర్ కు కు రేవంత్ రెడ్డి కొత్త పేరుపెట్టారు. ఇంతకీ కేటీఆర్ కు రేవంత్ పెట్టిన కొత్తపేరు ఏమిటంటే ‘సైకోరమ్’ అని. ఇకనుండి కేటీఆర్ ను అందరు సైకోరామ్(Psycho Ram) అనే పిలవాలని పిలుపిచ్చారు. కేటీఆర్(KTR) కు సైకోరామ్ అన్న పేరును ఫిక్స్ చేయాలని చెప్పారు. ఇంతకీ కేటీఆర్ కు సైకోరామ్ అన్న పేరు ఎందుకు పెట్టారు ? ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ పథకాన్ని, అమలుచేస్తున్న ప్రతీ కార్యక్రమానికి పదేపదే అడ్డుపడుతున్నారంటు రేవంత్ మండిపడ్డారు. ఇందుకు ఉదాహరణగా గౌతమ్ అదాని(Gautham Adani) స్కిల్ యూనివర్సిటికి రు. 100 కోట్ల విరాళంపై చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. తెలంగాణా ప్రభుత్వం(Telangana Government) ఏర్పాటుచేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదాని రు. 100 కోట్ల విరాళమిస్తే అదాని నుండి తాను తీసుకున్న ముడుపులుగా కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు.

యూనివర్సిటీ డెవలప్మెంట్ కు అదాని వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటిస్తే తనకు ముడుపులు అందినట్లు కేటీఆర్ ఆరోపణలు చేస్తుండటమే సైకో మనస్తత్వానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. అదాని తెలంగాణాలో చేపట్టిన ప్రాజెక్టులను రద్దుచేయాలని డిమాండ్ చేయటమే సైకో మనస్తత్వానికి ఉదాహరణగా రేవంత్(Revanth) చెప్పారు. ఎవరికి ఏ కాంట్రాక్టు దక్కినా అదంతా టెండర్ల నిబంధనల ఆధారంగానే దక్కుతుందన్న విషయాన్ని కేటీఆర్ మరచిపోయారా అంటు నిలదీశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో అదానికి పెద్దపీట వేశారని గోలచేస్తున్న కేటీఆర్ అండ్ కో మరి తమ హయాంలో ఇదే అదానికి ఇచ్చిన కాంట్రాక్టుల గురించి మాత్రం ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టులు ఇవ్వటమే తాను అదానితో కుమ్మకైనట్లు అనుకుంటే ఇదే కారణంగా కేసీఆర్(KCR) ను కూడా జైలుకు పంపాల్సిందే అని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో అదాని కంపెనీకి తెలంగాణాలో చాలా కాంట్రాక్టులు దక్కిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.

ఏదోరూపంలో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి తనపై కేసు పెట్టించుకుని అరెస్టయి జైలుకు వెళ్ళాలని కేటీఆర్ తెగప్రయత్నిస్తున్నట్లు రేవంత్ ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారన్న వార్తలను మీడియాలో చూసిన తర్వాత కేటీఆర్ కు కూడా అరెస్టవ్వాలన్న కోరిక మొదలైనట్లు చెప్పారు. అయితే కేటీఆర్ కన్నా ముందు తన చెల్లెలు కవిత(Kavitha) అరెస్టయి జైలుకు వెళ్ళిన సంగతి కేటీఆర్ మరచిపోయినట్లు రేవంత్ చెప్పారు. అరెస్టయి, జైలుకు వెళ్ళిన తర్వాత సీఎం అవ్వాలన్న ఆశకూడా కేటీఆర్ కు కల్లెలు కవిత లేకుండా చేశారని రేవంత్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పోస్టుకోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ ఎక్కువైపోయిందని రేవంత్ గుర్తుచేశారు. పదేళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కాస్త తెలివిగా మాట్లాడాలి కాని చిల్లర ఆలోచనలు మానుకోవాలని కేటీఆర్ కు చురకలు అంటించారు.

Tags:    

Similar News