"నా బీసీ, నా ఎస్సీ అని ఆ నోటితోనేనా అన్నావ్ జగన్?"

వైఎస్ జగన్ పై దుమ్మెత్తిపోసిన కె.పార్ధసారథి

Update: 2025-10-01 06:17 GMT
'నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ' అని చెప్పిన జగన్ ఇప్పుడు ఓ బీసీకి అన్యాయం చేస్తున్నాడని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఒకప్పటి జగన్ సహచరుడైన కొలుసు పార్థసారథి మండిపడ్డారు. దారుణంగా హత్యకు గురైన ఓ బీసీ నాయకుడు తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరుగుతుంటే వైసీపీ అడ్డుపడటం దారుణమన్నారు. జగన్ వంచకుడు, దుర్మార్గుడు అంటూ దుయ్యబట్టారు.
బడుగుల వంచనలో జగన్‌ మహాఘనుడని పార్థసారథి నిన్న మీడియాతో చెప్పారు. ‘వైసీపీ పాలనలో అన్ని ప్రధాన పదవులనూ అగ్రవర్ణాలు, సొంత సామాజిక వర్గానికే కేటాయించారు. చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు. గతంలోనూ ప్రభుత్వ స్థాయిలో పలుమార్లు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్థికసాయం సమకూర్చిన పరిస్థితి ఉంది. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి’ అని మంత్రి డిమాండ్‌ చేశారు.
గతంలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి అండగా నిలవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రయ్య కుమారుడికి శాశ్వత ఉద్యోగం కల్పించింది.
చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు ఇటీవల శాసనసభ కూడా తీర్మానం చేసింది. తోట చంద్రయ్య హత్యతో ఆయన కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. అందుకే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని నిర్ణయించామన్నారు.. చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే వైసీపీ నేత జగన్ అడ్డుకుంటున్నారని పార్థసారథి ఆరోపించారు.
Tags:    

Similar News