ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం డ్యాన్సర్ మృతి
డ్యాన్సర్ నానికి మరో రెండు నెలల్లో వివాహం జరగాల్సి ఉంది.;
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్యాన్సర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని భారీ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్యాన్సర్ల వాహనాన్ని నడుపుతున్న నాని ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మరో ఇద్దరు డ్యాన్సర్లు, లారీ డ్రైవర్ గాయాలపాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కృష్ణపాలెం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన డ్యాన్సర్లు నెల్లూరులో ప్రోగ్రాం ఇచ్చేందుకు బయలుదేరారు. టాటా మ్యాజిక్ వాహనంలో ఎనిమిది మంది డ్యాన్సర్లు విశాఖ నుంచి నెల్లూరుకు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా కృషంపాలెం జాతీయరహదారి వద్దకు రాగానే డ్యాన్సర్లు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం అప్పటికే లారీని కంటెయినర్ ఢీకొని వెనక్కి వస్తుండగా దాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో డ్యాన్సర్లు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని నడుపుతున్న నాని మృత్యువాత పడ్డారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు డ్యాన్సర్లు గాయాలపాలయ్యారు. నాని మృతదేహాన్ని గోపాలపురం సామాజిక ఆసుపత్రికి పోస్టుమర్టం కోసం తరలించారు. మృతి చెందిన డ్యాన్సర్ల వాహనం డ్రైవర్ నాని కూడా డ్యాన్సరే. నానిది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఆజ్జరం. ఇటీవలే నానికి పెళ్లి కూడా నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో నానికి పెళ్లి జరిపించాలని అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఆమేరకు నాని తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లల్లో ఉన్నారు. ఈలోగా నాని మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.