గ్రేట్ నాన్న..సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నావు

ఇంట్లో నాన్న అని, పనిలో బాస్‌ అని నాన్న చంద్రబాబును పిలుచుకునే అదృష్టం తనకు కలిగిందని మంత్రి లోకేష్‌ అన్నారు.;

Update: 2025-09-01 08:35 GMT

సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారంతో 30 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చంద్రబాబుపై తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. ఈ 30 ఏళ్ల కాలంలో తండ్రిగా, ఓ పార్టీకి అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పడిన కష్టాలను, నష్టాలను, ఎత్తూ పల్లాలను, సాధించిన విజయాలను ప్రస్తావించారు. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ రాజకీయ, జీవిత ప్రయాణంలో ముందుకు సాగారు.. హ్యాట్సాఫ్‌ నాన్న అంటూ పేర్కొన్నారు. ఆ మేరకు సోమవారం లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ భారీ పోస్టు పెట్టారు. సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్న చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక శుభాకాంలు తెలియజేశారు. తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫొటోను లోకేష్‌ షేర్‌ చేశారు.


లోకేష్‌ ఏమన్నారంటే..

నాన్న.. చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయి కంటే ఎక్కువ. నాడు హైటెక్‌ సిటీ నుంచి నేటి క్వాంటం వ్యాలీ వరకు ముఖ్యమంత్రి ఒక సజీవ వారసత్వమని నారా లోకేష్‌ చంద్రబాబు రాజకీయ ప్రయాణాన్ని కొనియాడారు. అంతేకాకుండా బయోటెక్‌ ఆకాంక్షల నుంచి డేటా డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు ఈ అభివృద్ధే ప్రత్యక్ష సాక్ష్యమని లోకేష్‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతగా కష్టపడి పని చేస్తూ, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్న చంద్రబాబు ఇంటో తనకు నాన్న.. పనిలో బాస్‌ అని, అలా పిలుచుకునే అదృష్టం కూడా తనకు లభించిందన్నారు. పరిపాలనకు సాంకేతికతను జోడించడంతో పాటు పెట్టుబడులు రాబట్టుకోవడం, తద్వారా డెవలప్‌మెంట్‌ చేయడం, ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం వరకు నాన్న ప్రయాణం సాగిందన్నారు. టెక్నాలజీ పరంగా, దానిని పాలనలో జోడించడంలో ముందు చూపుతో ఆలోచించి హైటెక్‌ సిటీ, జీనోమ్‌ వ్యాలీ వంటి అనేక కొత్త, కొత్త సాంకేతిక గుర్తింపును నాన్న శక్తివంతం చేశారని లోకేష్‌ పేర్కొన్నారు. నాటి నుంచి అమరావతి నిర్మాణం వరకు కొత్త కొత్త ఆవిష్కరణలు, వేగం, జవాబుదారీతనం, పౌర సేవలను అందించడంలో ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తూ సరికొత్త ఒరవడిని సృష్టించారు. సామాజిక న్యాయం చేయడంలో కానీ, సాధికారత సాధించడంలో కానీ, నదీ జలాలను సద్వినియోగం చేసుకుని కరువు ప్రాంతాలలోని ప్రజల జీవితాలను మార్చడంలో కానీ సీఎం చంద్రబాబు మార్కే వేరని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News