Tirumala Darshan Tickets| సిఫార్సులకు 'కొండంత' ప్రాధాన్యం!

టీటీడీ పాలక మండలి భేటీకి అజెండా సిద్ధం అవుతోంది. సామాన్యుల కోసం ఆలోచన ఉన్నా, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉన్నారు.

Update: 2024-11-16 11:00 GMT

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై జారీ చేసే విచక్షణ కోటా టికెట్ల సంఖ్య పెంచడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు కూడా అనుమతించడానికి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పాత పద్ధతిలో అలిపిరి, శ్రీవారిమెట్టు ప్రాంతాల్లో శీఘ్రదర్శనం టికెట్లు పగలే జారీ చేయడానికి వీలుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు టీటీడీ బోర్డు సెల్ అజెండా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలపై ముందస్తు అజెండా లేకున్నా, సమావేశం జరిగే సమయంలో టేబుల్ అజెండాగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొదటిసారి ఈనెల 18 తేదీ భేటీ కానున్నది. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగే టీటీడీ బోర్డు మీటింగ్ కు అజెండా కూడా సిద్ధమవుతోంది. కొన్ని ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
మొదటి నుంచి డిమాండ్
తిరుమలలో తమ సిఫారసు లేఖల కోటా పెంచడంతోపాటు అదనంగా దర్శనం టికెట్లు కూడా ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశాల్లో కూడా ఈ అంశంపై సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వద్ద కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమకు కేటాయించిన కోటా తక్కువగా ఉండటం వల్ల, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి లేఖలు జారీ చేయలేకుండా ఉన్నాం. దీనిపై పార్టీ శ్రేణుల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుందనే విషయాన్ని నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై పరిమితి విధించడం వల్ల తీవ్ర ఒత్తిడి పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తు చేశారని సమాచారం. దీంతో,
ఎమ్మెల్యేల కోటా పెంపుదల..
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎమ్మెల్యేలు. ఎంపీలు, ఎమ్మెల్సీలకు విచక్షణ కోటా ప్రోటోకాల్ ప్రకారం ఇస్తుంటారు. అదే వ్యవహారం మంత్రులకు కూడా వుంటుంది. వారు జారీ చేసే సిఫారసు లేఖల ఆధారంగా టీటీడీ తిరుమల లో శ్రీవారి దర్శనం తో పాటు వసతి సదుపాయం కూడా ఉంటుంది. దీనికి నిర్ణీత ధర చెల్లించాల్సిందే. అయితే,
రోజుకు ఒక లేఖకే అనుమతి
గత ఐదేళ్ల పాలనలో ఒక ఎమ్మెల్యేకి రోజుకు ఒక లేఖ మాత్రమే అనుమతించేవారు. అది కూడా వారంలో మూడు రోజులు మాత్రమే విచక్షణ కోట సిఫారసు లేఖలు తీసుకునేవారు. దీంతో తమ వద్దకు వచ్చే వారికి లేఖలు ఇవ్వడానికి ఇబ్బందిపడ్డామని ప్రజాప్రతినిధులు తమ బాధ వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో
ప్రజాప్రతినిధుల విచక్షణ కోట దర్శనాల టికెట్ల కోటాతో పాటు లేఖలు స్వీకరించే రోజుల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈనెల 18న జరిగే టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ఈ అంశం పైన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికార వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం : ప్రజా ప్రతినిధులు జారీ చేసే లేఖలను వారంలో నాలుగు రోజులు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక లేఖ మాత్రమే అనుమతిస్తున్నారు. వీఐపీ టికెట్ కోసం సిఫారసు చేస్తే, L-1 కాకుండా, రు. 300 శీఘ్ర దర్శనం టికెట్ కేటాయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిపై ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారనే విషయం ప్రచారం జరిగింది.
నిర్ణయం జరిగితే : 18న TTD Board Meeting లో విచక్షణ కోట లేఖలపై నిర్ణయం తీసుకుంటే, అదనంగా టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆదివారం మినహా, మిగతా అన్ని రోజుల్లో సిఫారసు లేఖలు తీసుకునేందుకు అవకాశం ఉండడంతో పాటు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (టికెట్ రు. 300) కూడా రోజుకు ఒక ఎమ్మెల్యేకు ఆరు టికెట్లు కేటాయించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలకు కూడా..
తిరుమలలో ఇటీవల కొంత కాలం నుంచి తమ లేఖలు స్వీకరించడం లేదని తెలంగాణ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తిరుమలలోనే నిరసన వ్యక్తం చేయడంతో పాటు హైదరాబాద్లో కూడా సవాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి.
టిడిపి కూటమి ప్రభుత్వం ఇటీవల నియమించిన టిటిడి బోర్డులో తెలంగాణ టిడిపి నేతలు, పారిశ్రామికవేత్తలను కూడా సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే.
దీనికంటే ముందే ఏపీ మంత్రి ఆగ్రహంగా ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలను శాంతం పరిచారు. బోర్డు ఏర్పాటు కాగానే సమచిత నిర్ణయం తీసుకొని అందరికీ ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఆ మేరకు మరో రెండు రోజుల్లో జరిగిపోయే బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సామాన్యులకు దివ్యదర్శనం టోకెన్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సామాన్య భక్తులకు మళ్ల దివ్యదర్శనం టోకెన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలినడకన వెళ్లి భక్తులకు దివ్య దర్శనం టోకల్లో జారీ చేసేవారు. 2018లో అప్పటి టీటీడీ ఈవో కేవీ. రమణాచారి అలిపిరి గాలిగోపురం వద్ద ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి మాజీ టీటీడీ చైర్మన్ బి. కరుణాకరరెడ్డి సారథ్యంలోని పాలకమండలి కూడా ఆమోదం ముద్ర వేసింది.
అలిపిరి మార్గంలో వెళ్లే వారికి రోజుకు 14, శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకు 6000 జారీ చేసేవారు. అలిపిరి మార్గంలో గాలిగోపురం వద్ద ఫొటో టోకెన్ జారీ చేస్తే, అవ్వ చారి కోనక సమీపనని నరసింహస్వామి ఆలయం వద్ద స్టాంపు వేసేవారు. ఈ టోకెన్తో సర్వదర్శనికి వెళ్లేవారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దీనిని రద్దు చేశారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో ప్రస్తుతం టైమ్ స్లాట్ టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకున్నవారు నిర్దేశి సమయానికి తిరుమల ఆలయం వద్ద రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ టికెట్లు తీసుకోవాలంటే సగం రాత్రి నుంచి తెల్లవారే వరకు నిద్రాహారాలు మార్పుని పడుకో రాసిన పరిస్థితి ఏర్పడుతుంది.
అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో పాత పద్ధతిలోనే సేకర దర్శనం జారీ చేయడం వల్ల కాలినడకన వెళ్లే వారికి సులభతరంగా ఉంటుందని ప్రశ్న టిటిడి పాలకమండలి భావిస్తోంది దీనిపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Tirumala, AP, Telangana MLAs, Srivari Darshanoo Tickets, TTD Board Meeting, Chairman TV5 BR Naidu, Tirumala Darshans Tickets
Tags:    

Similar News