జాతీయ పాజెక్టులను సకాలంలో పూర్తి చేయండి

ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సీఎస్‌లతో సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.;

Update: 2025-04-30 14:45 GMT

వివిధ జాతీయ, అంతర్‌ రాష్ట్ర ప్రాజెక్టులను సకాలంలో వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ను ఆదేశించారు. ప్రధాన మంత్రి మాతృవందన యోజన ఫిర్యాదుల పరిష్కారం,

తుంకూర్‌–రాయదుర్గం వయా కళ్యాణదుర్గం నూతన రైల్వే లైను ప్రాజెక్టు, ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు తదితర అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్పెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ జాతీయ, అంతర్‌ రాష్ట్ర ప్రాజెక్టులను సకాలంలో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రధాన మంత్రి మాతృ వందన యోజనకు సంబంధించిన ఫిర్యాదులు సత్వరం పరిష్కారించాలని చెప్పారు. పీఎం విశ్వకర్మ యోజన పధకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సీఎస్‌లను ఆదేశించారు. రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సకాలంలో తుంకూరు రైల్వే లైను నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఢిల్లీ నుండి వర్చువల్‌గా జరిగిన ఈ వీడియో సమావేశంలో ఏపీ నుంచి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ మాట్లాడుతూ తుంకూరు– రాయదుర్గం వయా కళ్యాణదుర్గం కొత్త లైన్‌ 206 కిమీ ఉన్న ఈ ప్రాజెక్టుకు 2009లో ఆమోదం లభించిందని ప్రధానికి వివరించారు. దీని ప్రాజెక్టు వ్యయం రూ. 970.34 కోట్లు కాగా ఈ పనులను 2015 నాటికి పూర్తి చేయాల్సి ఉందని ఆలస్యం కారణంగా సవరించిన వ్యయం రూ. 2,495.86 కోట్లకు చేరిందని వివరించారు. అలాగే పనులు పూర్తి చేయాల్సిన సమయం 2027 కు పెంచారని తెలిపారు.
ఈరైల్వే లైనుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 93 కిమీలకు గాను 75 కిమీలు మేర ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రధానికి వివరించారు. మిగతా 18 కిమీ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అదే విధంగా ఏపి నుండి ఎటువంటి భూసేకరణ పనులు పెండింగ్‌లో లేవని సిఎస్‌ విజయానంద్‌ ప్రధానికి వివరించారు.
Tags:    

Similar News