SPS అధికారులకు IPS అధికారులుగా ప్రమోషన్ కోసం కమిటీ
స్టేట్ పోలీస్ సర్వీస్ అధికారులను ఐపీఎస్ అధికారులుగా ప్రమోట్ చేసేందుకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు.;
ఐపీఎస్ అధికారుల నియామకాలకు సంబంధించిన ప్రమోషన్ 1955 ఐపీఎస్ రెగ్యులేషన్స్‌లోని నిబంధనల ప్రకారం 2024 సంవత్సరానికి సెలెక్ట్ లిస్ట్ సిద్ధం చేయడానికి ఎంపిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SC-C) డిపార్ట్‌మెంట్ ఉత్తర్వు సంఖ్య G.O.Rt.No.1297 తేదీ: 09-07-2025 విడుదల చేసింది. ఈ కమిటీలో కీలక సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి కె విజయనంద్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరిష్ కుమార్ గుప్తా ఉన్నారు.
ఈ ఎంపిక కమిటీలో యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇండియన్ గవర్నమెంట్ నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. ఈ కమిటీ 2024 సంవత్సరానికి SPS (State Police Service) అధికారులను IPS ఏపీ క్యాడర్‌కు ప్రమోషన్ కోసం సెలెక్ట్ లిస్ట్ సిద్ధం చేయనుంది. ఈ ఉత్తర్వులు గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జారీ చేశారు.