శ్రీశైలంలో పర్యటించనున్న చంద్రబాబు..

సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో పర్యటించడానికి సిద్దమవుతున్నారు. శ్రీశైలం బ్యారేజీకి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరుతోంది.

Update: 2024-07-30 05:24 GMT

సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో పర్యటించడానికి సిద్దమవుతున్నారు. శ్రీశైలం బ్యారేజీకి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరద నీరు చేరుతోంది. సోమవారం ఏడు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు అధికారులు. ఈ నేపథ్యంలో బ్యారేజీని సీఎం చంద్రబాబు సందర్శించడం కీలకంగా మారింది. సీఎం పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీశైలం బ్యారేజీని పరిశీలించిన అనంతరం అక్కడి అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా గురువారం ప్రాజెక్ట్ దగ్గర జల హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

గంగమ్మకు సారే సర్పించనున్న సీఎం

తన శ్రీశైలం పర్యటనలో భాగంగానే గంగమ్మకు సీఎం చంద్రబాబు.. జల హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాకుండా గంగమ్మకు చీరే సారే సర్మించనున్నారు. అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అనంతరం శ్రీశైలంలోని శాంతి భద్రతలు, అక్కడి వరద ఉధృతి గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా శ్రీశైలంలోని కూటమి నేతలతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారని సమాచారం.

శ్రీశైలానికి భారీగా వరద

ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో దాదాపు 10 అడుగల మేరా నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ఫ్లో 4,60,040 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 1,41,560 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 880.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోని నీటిమట్టం 198.3623 టీఎంసీలకు చేరుకుంది.

కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతున్న క్రమంలో మూడు గేట్లు ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు వదిలారు. గేట్లను ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర పర్యాటకుల సందడి నలకొంది. ఇప్పుడు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్న క్రమంలో నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 81,634 క్యూసెక్కులుగా ఉంది. ఎనిమిది టర్బయిన్స్‌లలో విద్యాత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 514.60 అడుగుల వరకు నీరు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 139.61 టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌లో ఉంది.

ఇదిలా ఉంటే వర్షాల కారణంగా గోదావరి నది కూడా ఉగ్రరూం దాల్చి పరవళ్లు తొక్కుతోంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేటీ దగ్గర ఇప్పటికే రెండో ప్రమాద ఘంటిక కూడా మోగగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి మట్టం మూడో డేంజర్ మార్క్‌కు దగ్గరగా ఉంది. ఇప్పటికే అక్కడి నుంచి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ వరదల నేపథ్యంలోనే వరద బాధితుల కష్టాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మంత్రులు కూడా స్వయంగా రంగంలోకి దిగి వరద బాధితుల కష్టాలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.

Tags:    

Similar News